Chris Cairns paralysed after stroke during heart surgery అల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ ను వెంటాడుతున్న విషాదాలు..

Chris cairns suffers paralysis in legs after life saving heart surgery

new zealand, former allrounder, New Zealand cricket legend, chris cairns, Heart surgery, paralysed in legs, Heart stroke, new zealand cricket, cricket, cricket news

New Zealand cricket legend Chris Cairns has been left paralysed after suffering a stroke during a heart operation and faces "a long road to recovery", his family said Friday. Cairns, 51, one of the world's top all-rounders in the early 2000s, suffered a life-threatening heart condition this month when a tear developed in the lining of a major artery.

అల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ ను వెంటాడుతున్న విషాదాలు..

Posted: 08/27/2021 07:39 PM IST
Chris cairns suffers paralysis in legs after life saving heart surgery

న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌, ప్ర‌పంచ మేటి ఆల్ రౌండర్లలో ఒక‌డైన క్రిస్ కెయిన్స్ పై దైవం పగబట్టాడా.? అన్నట్లు మారుతోంది ఆయన పరిస్థితి. తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా.. సంపాదించిన డబ్బంతా క్రికెట్ కోసమే వెచ్చించిన ఈ మేటి ఆటగాడికి ఆ మ‌ధ్య గుండె సంబంధిత జ‌బ్బుతో అసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అక్కడ ఐసీయూ వార్డులో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి కూడా. అయితే చికిత్సకు ఆయన మెరుగ్గా స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.

కాగా, తాజాగా అత‌నికి గుండెను శస్త్రచికిత్స చేసి.. ఆయనను పూర్వపు మనిషిలా తిరిగి ఫిట్ గా చేద్దామని భావించిన వైద్యుల ప్రయత్నాలను దేవుడు అడ్డుకున్నాడా.? అన్నట్లు అనిపిస్తోంది. క్రిస్ కెయిన్స్ కు ఆప‌రేష‌న్ చేస్తుండగా.. అదే స‌మ‌యంలో స్ట్రోక్ వ‌చ్చింద‌ని, దీంతో కెయిన్స్ కాళ్ల‌కు ప‌క్ష‌వాతం వ‌చ్చిన‌ట్లు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. ఈ నెల మొద‌ట్లో అత‌న్ని క్యాన్ బెరాలోని అసుపత్రిలో అడ్మిట్ చేయ‌గా.. స‌ర్జ‌రీ కోసం సిడ్నీకి త‌ర‌లించారు. అక్క‌డ అత్య‌వ‌స‌రంగా స‌ర్జ‌రీ నిర్వ‌హించినా.. ఇప్పుడు కాళ్లకు ప‌క్ష‌వాతం రావ‌డంతో కెయిన్స్ ఇప్ప‌ట్లో కోలుకునేలా క‌నిపించ‌డం లేదు.

కాళ్లు చ‌చ్చుబ‌డిపోవ‌డంతో ఆస్ట్రేలియాలోనే మ‌రో స్పెష‌లిటీ ఆసుపత్రిలో కెయిన్స్‌కు రీహాబిలిటేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు చెప్పారు. సిడ్నీలో స‌ర్జ‌రీ త‌ర్వాత కెయిన్స్‌ను కుటుంబ స‌భ్యులు మ‌ళ్లీ క్యాన్‌బెరాకు తీసుకొచ్చారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో కెయిన్స్ కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న అంద‌రికీ కుటుంబ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. న్యూజిలాండ్ త‌రఫున కెయిన్స్ 1989 నుంచి 2004 మ‌ధ్య 62 టెస్టులు ఆడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles