Manu Sawhney leaves ICC with immediate effect ఐసీసీ సీఈఓ పదవికి రాజీనామా చేసిన మను సాహ్నే

Icc board relieves manu sawhney as ceo with immediate effect

ICC, CEO, Manu Sawhney, resign, BCCI, ESPN, international cricket council, Greg Barclay, immediate effect, disciplinary hearing, Geoff Allardice, Sawhney, Leadership Team, cricket news, sports news, sports, Cricket

The ICC board has decided to relieve Manu Sawhney as the CEO with immediate effect, ending a long-running saga at the very top of the organisation's management. The decision was taken by the ICC board at an emergency meeting on Thursday, chaired by Greg Barclay, the ICC chairman.

ఐసీసీ సీఈఓ పదవికి రాజీనామా చేసిన మను సాహ్నే

Posted: 07/09/2021 09:36 PM IST
Icc board relieves manu sawhney as ceo with immediate effect

ఐసీసీ సీఈవో మను సాహ్నే రాజీనామాను వెంటనే ఆమోదించింది ఐసీసీ బోర్డు. ఇక తాత్కాలిక సీఈవోగా జియోఫ్‌ అలార్డైస్‌ను కొనసాగించనుంది. ఐసీసీ బోర్డు సభ్యులతో మను ప్రవర్తనపై గత కొన్ని నెలలుగా విమర్శలు వినవస్తున్నాయి. 56 ఏళ్ల మను.. సహచరులను లెక్కచేయకపోవడం, దూకుడు స్వభావం లాంటి చేష్టలతో బోర్డులో అసంతృప్తిని రాజేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కిందటి ఏడాది ఎన్నికల సమయంలో ఇంటీరియమ్‌ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖ్వాజాను కొన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు బలపరిచాయి. అలాగే వచ్చే సీజన్‌లకు సంబంధించిన ఈవెంట్ల ఫీ కూడా ఇప్పుడే చెల్లించాలని ఆయన తీసుకున్న నిర్ణయం బోర్డుల్లో ఆయన పట్ల వ్యతిరేకతను రాజేశాయి.

2019 వరల్డ్‌కప్‌ తర్వాత డేవ్‌ రిచర్డ్‌సన్‌ పదవీ కాలం ముగియడంతో సీఈవోగా ష్వానేను ఐసీసీ ఎంచుకుంది. పదవీ కాలపరిమితి 2022 వరకు ఉన్నా.. ఆయనపై వ్యతిరేకతతో బలవంతంగా రాజీనామా చేయించింది ఐసీసీ బోర్డు.  మను ష్వానే.. ఐసీసీకి ఐదో సీఈవో. ఇంతకు ముందు సింగపూర్‌ స్పోర్ట్స్‌ హబ్‌ కోసం, ఈఎస్‌పీఎన్‌ స్టార్‌స్పోర్ట్స్‌కు 22 ఏళ్లపాటు ఎండీగా పనిచేశాడు. ఆయన స్వస్థలం ఢిల్లీ. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో చదివిన ష్వానే.. బిట్స్‌ పిలానీలో బీఈ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. ఐఐఎఫ్‌టీ(ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌)లో ఎంబీఏ చదివాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC  CEO  Manu Sawhney  resign  BCCI  ESPN  sports  Cricket  

Other Articles