పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలో ఇంగ్లండ్ పై గెలిచి 4 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసిన కోహ్లీ సేన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టులో ఓటమి కావడంతో పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి పడిపోయింది.
కాగా, టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. న్యూజీలాండ్ తన ఖాతాలో 420 పాయింట్లతో అగ్రస్థానంలో వుండగా, మరో బెర్తు కోసం భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య గట్టిపోటీ నెలకొంది. టీమిండియా జట్టు ఈ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అలా సాధ్యం కాని పక్షంలో ఒక్క మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ డ్రా చేసుకున్నా ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ జాబితాలో స్థానాన్ని నిలుపుకుంటుంది.
ఈ సిరీస్ ను టీమిండియా గానీ, ఇంగ్లండ్ గానీ 3-1 తేడాతో గెలిస్తే, గెలిచిన జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అలా కాకుండా 2-2తో గానీ, 1-1తో గానీ సిరీస్ సమం అయినా, 2-1తో ఇంగ్లండ్ గెలిచినా... భారత్, ఇంగ్లండ్ జట్లలో ఏ ఒక్కటీ ఫైనల్ చేరకపోగా.... ఫైనల్లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా ఆడుతుంది. ప్రస్తతం టీమిండియా అరో ప్రపంచ టెస్టు చాంఫియన్ షిప్ లో ఆరవ సిరీస్ అడుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే పది మ్యాచులలో విజయాన్ని అందుకున్న భారత్.. నాలుగు మ్యాచులను ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ ను మాత్రం డ్రాగా ముగించింది. ఈ విజయంతో టెస్టు ర్యాంకింగ్ లలో అశ్విన్ అటు అల్ రౌండర్ జాబితాలో ఆరవ స్థానంలోనూ.. ఇటు బౌలర్ల జాబితాలోనే ఏడో స్థానంలో కొసాగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more
Feb 09 | టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన తాజా ట్వీట్ ద్వారా తన అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ అభిమానులను కూడా అందోళనకు గురిచేస్తున్నాడు. ట్విటర్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో.. టీమిండియా మాజీ... Read more