India Crush England by 317 Runs in Chennai Test ఇంగ్లాండ్ పై టీమిండియా ప్రతీకారం.. చెన్నై టెస్టులో భారీ విజయం

India vs england 2nd test day 4 india beat england by 317 runs to level series 1 1

India vs England 2nd Test Day 4 Score, India vs England 2nd Test Day 4, England vs India 2nd Test, IND vs ENG 2nd Test Day 4 Live, Day 4 2nd Test, Chennai Test, Chennai Weather Forecast, Chennai Rain prediction, IND vs ENG Chennai Test, IND vs ENG test, India vs England 2021 final date, India vs England 2021 news, India vs England 2021 latest news, India vs England 2021 schedule, India vs England teams, IND vs ENG Test, IND vs ENG Test Schedule, IND vs ENG Match Scorecard, India vs England 2021 fixture list, India vs England 2021 points table,

India wrapped up England’s second innings inside 55 overs as they were bowled out for 164. With this win, India have levelled the series at one-all and are still alive in the hunt for a final spot at the inaugural ICC World Test Championship set to be played later this year.

ఇంగ్లాండ్ పై విరాట్ సేన ప్రతీకారం.. చెన్నై టెస్టులో భారీ విజయం

Posted: 02/16/2021 03:34 PM IST
India vs england 2nd test day 4 india beat england by 317 runs to level series 1 1

పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జ‌రిగిన‌ రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56 ఓవర్లలోనే టీమిండియా బౌలర్లు చాపచుట్టించేశారు. భార‌త బౌల‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఎవ‌రూ క్రీజులో నిల‌దొక్కుకోలేక‌పోయారు. తొలి ఇన్నింగ్స్‌ నుంచే టీమిండియా ఇంగ్లాండ్ పై పేచేయి సాధించాలన్న పట్టుదలతో వుంది. ఫలితంగా చెన్నైలో రెండు ఇన్నింగ్స్ లో నిలదొక్కుకోలేక అత్యంత తొందరగా చాపచుట్టేసింది.

తొలిఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన అక్ష‌ర్ ప‌టేల్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ప‌డ‌గొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బ‌కొట్టాడు. వారికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 164 పరు‌గుల‌కే ఆలౌట్ అయింది. ఫ‌లితం... టీమిండియా 317 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌‌ను భార‌త్‌ 1-1తో సమం చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 329, రెండో ఇన్నింగ్స్‌లో 286 ప‌రుగులు చేసి ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134, రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో  బ‌ర్న్స్ 25, సిబ్లీ 3, లారెన్స్ 26, జాక్ లీచ్ 0, కెప్టెన్ రూట్ 33, బెన్ స్టోక్స్ 8, పోప్ 12, బెన్ ఫోక్స్ 2 , మోయీన్ అలీ 43, స్టోన్ 0, బ్రాడ్ 5 ప‌రుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ కొట్టి టీమిండియా గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన రోహిత్ శ‌ర్మ, రెండో ఇన్నింగ్స్‌లో శ‌త‌కంతో అద‌ర‌గొట్టిన అశ్విన్‌పై స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా ఎవ్వరూ రాణించలేదని బావిస్తున్న తరుణంలో తన హోం గ్రౌండ్ లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అశ్విన్. ఓ వైపు బంతితోనూ రాణిచిన అశ్విన్.. ఈ టెస్టులో బ్యాటుతోనూ రాణించాడు. మరోలా చెప్పాలంటే చెన్నై రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తరపున శతకం బాదిన హీరోగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ 26, శుభ్‌మ‌న్ గిల్ 14, పుజారా 7, కోహ్లీ 62, పంత్ 8, ర‌హానె 10, అక్ష‌ర్ పటేల్ 7, అశ్విన్ 106 కుల్‌దీప్ యాద‌వ్ 3, ఇషాంత్ శ‌ర్మ 7, సిరాజ్ 16 ప‌రుగులు చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  England  India vs England  Ind vs Eng  score  chennai test  2nd test  3rd test  ahmedabad test  cricket  sports  

Other Articles

 • Its official ipl 2021 moved to uae bcci vice president rajeev shukla

  ఐపీఎల్ అభిమనులకు గుడ్ న్యూస్.. యూఏఈలో వాయిదాపడ్డ మ్యాచులు

  May 29 | అత్యంత ప్రతిష్టాత్మకంగా బిసిసిఐ నిర్వహిస్తున్న కాసుల పండగగా పేర్కోనే ఐపీఎల్‌-2021 వాయిదా పడిన విష‌యం తెలిసిందే. భార‌త్‌ లో కరోనా వైరస్ రెండో దశ విజృంభ‌ణ నేప‌థ్యంలో పలువురు భారతీయ క్రికెటర్లకు కరోనా సోకడం... Read more

 • India vs england 4th t20i suryakumar yadav out due to soft signal

  సిక్స్ తో తన ఐసీసీ ఖాతాను తెరచిన సూర్యకుమార్

  Mar 18 | సూర్యకుమార్‌ యాదవ్‌ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more

 • Bcci announces india women s odi and t20i squads for south africa series

  సౌతాఫ్రికా టూర్ కు టీమిండియా జట్టు ఇదే.!

  Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని సభ్యుల... Read more

 • Jasprit bumrah to miss fourth test against england for personal reasons

  ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. రీజన్ పర్సనల్..

  Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్‌ అహ్మదాబాద్‌ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more

 • Icc t20 rankings kl rahul gains one spot to reach second

  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: 2వ స్థానంలో రాహుల్..

  Feb 16 | అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేయగా, అందులో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more

Today on Telugu Wishesh