టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన తాజా ట్వీట్ ద్వారా తన అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ అభిమానులను కూడా అందోళనకు గురిచేస్తున్నాడు. ట్విటర్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని అనుసరించాడా.? అంటే జేడాజా కూడా ఆయన మార్గంలోనే పయనిస్తున్నాడా.. అన్న ఉత్కంఠ రేకెత్తుతోంది. అందుకు అసులు కారణం ఈయన ట్వీట్ చేసిన సమయం. జడేజా పోస్ట్ చేసిన సమయం రాత్రి 7. 47 గంటలు... ఈ టైమ్ చూస్తే మనకు ఒక అంశం గుర్తుకురాక మానదు. అదే ఎంఎస్ ధోని రిటైర్మెంట్. ధోని కూడా ఇదే సమయానికి అటూ ఇటుగా గుడ్‌బై చెప్పాడు. 2020 ఆగస్టు 15.. రాత్రి 7.29 గంటలకు ధోని ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు.
ఇప్పుడు జడేజా కూడా అదే సమయానికి వీడియో పెట్టడం.. అతను రాసుకొచ్చిన క్యాప్షన్ కూడా అదే విధంగా ఉండడంతో కొంతమంది ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. జడేజా కూడా రిటైర్ అయ్యాడా అంటూ కామెంట్లు కూడా జత చేశారు. దీంతో జడేజా పోస్టు ట్విటర్లో ట్రెండింగ్ లిస్ట్‌లోకి ఎక్కేసింది. ఇక అసలు విషయంలోకి వెళితే.. రవీంద్ర జడేజా టీమిండియాలోకి అరంగేట్రం చేసి నిన్నటితో( ఫిబ్రవరి 8) 12 సంవత్సరాలు పూర్తైంది. ఫిబ్రవరి 8, 2009లో శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన జడేజా ఈ పుష్కర కాలంలో గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.
తన 12 ఏళ్ల కెరీర్లో 168 వన్డేల్లో 2411 పరుగులు, 51 టెస్టుల్లో 1954 పరుగులు, 50 టీ20ల్లో 217 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే.. వన్డేల్లో 188 వికెట్లు, టెస్టుల్లో 220 వికెట్లు, టీ20ల్లో 39 వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా జడేజా టీమిండియాతో తన 12 ఏళ్ల ప్రస్థానాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. ' నా చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలనే కోరిక బలంగా ఉండేది. 12 ఏళ్ల క్రితం అది నెరవేరినా.. ఇంకా మొన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. భారత్‌కు ఆడడం అనేది మాటల్లో వర్ణించలేను.. దేశానికి ఆడడమే గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంతకాలం నాకు మద్దతు, ప్రేమను పంచిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more