టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్ కు దూరమైన వార్నర్.. టెస్టు సిరీస్ కు కూడా దూరం కానున్నాడు. డిసెంబర్ 17 నుంచి టీమిండియా, ఆసీస్ జట్ట మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయాల బారిన పడిన వార్నర్ ఈ సిరీస్ కు అందుబాటులోకి వస్తాడని భావించిన క్రికెట్ అస్ట్రేలియా.. ఆయన తొలి టెస్టుకు అందుబాటులోకి రావడం కూడా అనుమానమేనన్న విషయాన్ని వెల్లడించింది.
అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టుకు వార్నర్ దూరం కానున్నారు. గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్ ల నుంచి తప్పుకున్న ఆయన తాజాగా తొలి టెస్టుకు కూడా దూరం కానున్నారు. కాగా పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి మరో పది రోజుల సమయం పడుతుందని వార్నర్ తెలిపాడు. అయితే మెల్ బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు. వార్నర్ గాయం గురించి ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. అతడు మెల్ బోర్న్ టెస్టుకు పూర్తిఫిట్ నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే డే-నైట్ టెస్టుకు వార్నర్ దూరం కావడం అస్ట్రేలియా జట్టుకు షాకేనంటున్నారు క్రికెట్ అభిమానులు.
పింక్ బాట్ టెస్టులో ప్రతిభ కనబరుస్తున్న వార్నర్ తో పాటు ఆసీస్ యువ ఓపెనర్ విల్ పకోస్కీ కూడా కంకషన్‌కు గురికావడం ఆ జట్టును కలవరపెడుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో కార్తీక్ త్యాగి విసిరిన బౌన్సర్ అతడి హెల్మెట్ కు తాకింది. అతడిలో కంకషన్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో డిసెంబర్ 11 నుంచి జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఓ వైపు పింక్ బాల్ తో బౌలర్ల అధిపత్యాన్ని చిధ్రం చేసి.. బౌండరీలను సునాయాసంగా బాదే అనుభవశాలి వార్నర్ జట్టుకు దూరం కావడం ఆస్ట్రేలియాకు ప్రతికూలాంశమే. చివరి వన్డే.. తొలిరెండు టీ20లలో వార్నరత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more
Nov 28 | తన జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు ఓ బ్యాట్స్ మెన్ ఎం చేయగలడో అదే టీమిండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య చేశాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కొనియాడాడు. భారత జట్టుకు... Read more