Shoaib Akhtar bats for Indo-Pak bilateral cricket భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

shoaib akhtar, india pakistan cricket, india vs pakistan cricket, pakistan cricket, shoaib akhtar youtube, Virat Kohli, kabaddi, Cricket, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

Former Pakistan pacer Shoaib Akhtar has advocated a bilateral series between arch-rivals India and Pakistan. The two cricketing nations have not locked horns together in a bilateral series since 2012.

భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

Posted: 02/18/2020 06:32 PM IST
Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత్ పాకిస్థాన్ దేశాలమధ్య దైపాక్షిక వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి.. కానీ క్రికెట్ మాత్రం ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ క్రీడపై ఇప్పటికైనా భారత్ సానుకూలంగా స్పందించాలని కోరారు.
 
అన్నివిధాల వాణిజ్య దిగుమతులు, ఎగుమతులు సాగుతున్న సందర్భంలో.. ఒక దేశం నుంచి మరో దేశానికి ఉల్లిపాయలు, ఆలుగడ్డల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు జరగడం క్రికెట్ కు మంచిదని వ్యాఖ్యానించారు. క్రికెట్ ఒక్కటే క్రీడాగా గుర్తిస్తున్నారా.? ఇది కాకుండా మిగతా క్రీడలన్నింటిలో పోటీకి సై అంటున్న క్రమంలో క్రికెట్ పై మాత్రమే ఎందుకు అంక్షలు విధించారని ప్రశ్నించారు.

ఇండియా ప్లేయర్లు పాకిస్థాన్ కు, పాకిస్థాన్ ప్లేయర్లు ఇండియాకు వచ్చే పరిస్థితి లేదని.. అయితే విదేశాల్లోని తటస్థ వేదికలపై మ్యాచ్ లు నిర్వహించాలని సూచించారు. ఆసియా కప్ నిర్వహణ ఎలా పాల్గోంటున్నారో అలానే భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దైపాక్షిక క్రికెట్ కు తటస్థ మైదానాలు వేదికలుగా మార్చుకోవచ్చుకదా అని షోయబ్ అక్తర్ అన్నారు. తాము సచిన్ ను, గంగూలీని, సెహ్వాగ్ ను ఎంతగానో ఇష్టపడతామన్నారు. ఇరు దేశాల మధ్య విభేదాలు క్రికెట్ పై ప్రభావం చూపకూడదన్నది తన అభిప్రాయమని చెప్పారు. త్వరలోనే ఇండియా–పాక్ మ్యాచులు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shoaib Akhtar  India  Pakistan  india vs pakistan cricket  Asia Cup  Cricket Match  Venue  Cricket  Sports  

Other Articles