ICC Under-19 World Cup: India beat Pakistan by 10 wickets పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన భారత్ కుర్రాళ్లు..

Icc under 19 cricket world cup 2020 semi final india thrash pakistan by 10 wickets storm into final

Akash Singh, Atharva Ankolekar, Dhruv Jurel, Divyaansh Saxena, Divyansh Joshi, ICC U-19 World Cup, ICC U-19 World Cup 2020, ICC U19 World Cup 2020 Semifinal Match, India U-19 cricket team, India U-19 vs Pakistan U-19, India vs Pakistan, India vs Pakistan U19 World Cup, Kartik Tyagi, Kumar Kushagra, Pakistan U-19 cricket team, Ravi Bishnoi, Shashwat Rawat, Shubhang Hegde, Siddhesh Veer, Sushant Mishra, Tilak Varma, under 19 world cup semi final, Vidyadhar Patil, Yashasvi Jaiswal, Cricket news, sports news, Cricket, sports

In the first semifinal of ICC Under-19 World Cup 2020, India walloped their arch-rivals Pakistan by 10 wickets to enter their seventh ICC U-19 World Cup final at JB Marks Oval, Potchefstroom on Tuesday.

పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన భారత్.. శతకబాదిన జైస్వాల్

Posted: 02/04/2020 09:33 PM IST
Icc under 19 cricket world cup 2020 semi final india thrash pakistan by 10 wickets storm into final

ఐసీసీ అండ‌ర్‌-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త కుర్రాళ్లు కుమ్మేశారు. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో ఏడోసారి ఫైన‌ల్ కు చేరి సరికొత్త రికార్డును తమ పేరున లిఖించుకున్నారు. దక్షిణాఫ్రికా లోని పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా ఇవాళ జరిగిన ఉపపోరులో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. భారత్ కుర్రాళ్లు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పది వికెట్లతో పాకిస్థాన్ ను మట్టికరిపించారు. అంత‌కుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను భారత యువ బౌలర్ల ధాటికి స్వల్పస్కోరుకే తోకముడిచారు. 43.1 ఓవ‌ర్ల‌ు అడిన పాకిస్థాన్ జట్టు కేవలం 172 ప‌రుగుల‌ను మాత్రమే చేయగలిగింది.

దీంతో 173 పరుగుల లక్ష్య ఛేద‌న‌తో బరిలో దిగిన భార‌త్ 35.2 ఓవ‌ర్ల‌లో వికెట్లు కోల్పోకుండా 176 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. య‌శస్వి జైస్వాల్ (113 బంతుల్లో 105 నాటౌట్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. మ‌రో ఓపెన‌ర్ దివ్వాంశ్ స‌క్సేనా (59 నాటౌట్) అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. స్వ‌ల్ప ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన భార‌త్‌ను పాక్ ప్లేయ‌ర్లు ఏమాత్రం అడ్డుకోలేక‌పోయారు. భార‌త బ్యాట్స్‌మెన్ అన్ని విధాల ఆధిప‌త్యం క‌న‌బ‌ర్చారు. వీరిద్ద‌రూ ఏమాత్రం తొందరపడకుండా, ఎంతో పరిణితి చెందిన ఆటగాళ్ల మాదిరిగా రాణించారు.

నింపాదిగా ఆడుతూ జట్టు స్కోరుబోర్డును ముందుకు నడిపించారు.. ఈక్ర‌మంలో 66 బంతుల్లో జైస్వాల్‌ అర్ధ‌సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. కాసేప‌టికే భార‌త్ స్కోరు 100 ప‌రుగుల మార్కును దాటింది. ఫిఫ్టీ అయ్యాక జైస్వాల్ జోరు పెంచాడు. మ‌రో ఎండ్‌లో కుదురుగా ఆడిన స‌క్సేనా 83 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మ‌రోవైపు జోరు పెంచిన జైస్వాల్ 90ల్లోకి దూసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 36వ ఓవ‌ర్లో భారీ సిక్సర్ తో తనదైన శైలిలో సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. టోర్నీలో మూడు అర్ధ‌సెంచ‌రీలు చేసిన జైస్వాల్‌.. పాక్‌పై శ‌త‌కాన్ని సాధించాడు.

మరోవైపు టోర్నీలో ఏడోసారి ఫైన‌ల్‌కు చేరుకుంది. నాలుగుసార్లు విజేతగా నిలిచిన భార‌త్‌.. రెండుసార్లు ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. 2018లో ఆస్ట్రేలియాలో జ‌రిగిన చివరి ఎడిషన్‌లో నెగ్గిన భార‌త్‌.. డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగింది. తాజా విజ‌యంతో వ‌రుస‌గా నాలుగోసారి తుదిపోరుకు అర్హ‌త సాధించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీని గురువారం న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్ సెమీస్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ విజేత‌తో భారత్ ఆదివారం ఇదే వేదిక‌పై ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles