MS Dhoni serving Pani Puri in Maldives మాల్దీవుల్లో పానీపూరీ అందిస్తున్న ఎంఎస్ ధోని.. వైరల్

Ms dhoni serving pani puri in maldives video goes viral

India vs New Zealand, MS Dhoni, India captain, Chennai Super Kings, ICC trophies, Mahendra Singh Dhoni, RP Singh, Pani Puri, Maldives, India captain, Viral Videos, Cricket, latest cricket news, today cricket match, cricket score, sports news, cricket news, sports

Former Indian Cricket team captain Mahendra Singh Dhoni stood on news headlines after serving Pani Puri in the Maldives. A video of MS Dhoni serving Pani Puri to cricketer RP Singh gone viral on social media and creating a buzz.

మాల్దీవుల్లో పానీపూరీ అందిస్తున్న ఎంఎస్ ధోని.. వైరల్

Posted: 02/05/2020 05:35 PM IST
Ms dhoni serving pani puri in maldives video goes viral

టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మిస్టర్ కూల్ అన్న విషయం తెలిసిందే. మైదానంలోకి దిగినా.. లేక ఇంట్లో తన వాహనాలు, లేదా పెంపుడు జంతువులతో ఆడినా.. అదీ కాక కుటుంబసభ్యులతో హాలీడేలకు వెళ్లినా.. వీటన్నింటినీ పక్కనబెట్టి టీమిండియా క్రికెటర్లతో కలసి బయటకు వెళ్లినా.. చాలా సరదాగా వుంటాడన్న విషయం కూడా తెలిసిందే. తన పరిసరాలతో అల్లుకునిపోని తన మదిని ప్రశాంతంగా వుంచుకోవాలని చూస్తుంటాడు ధోని.

తాజాగా మహేంద్రుడికి చెందిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ధోని తన సహచర ఆటగాళ్లతో కలసి సరదాగా మాల్దీవుల పర్యటనకు వెళ్లినప్పుడు తీసింది. అక్కడ ఆయన స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసే క్రమంలో ఓ పానీపూరీ దుకాణాం వద్దకు చేరుకని అదెలా తయారు చేస్తారన్న విధానాన్ని పరిశీలించాడు. అంతే ఇక ఎంచక్కా అటువైపు వెళ్లి ఒ గప్ చుట్ (పానీ పూరి) తీసుకుని దానిలో పప్సు, ఇతర ద్రవ్యాలను జోడించాడు.

ఇక చివరగా నీటిని కూడా నింపేసి.. తన ఎదురుగా ప్లేటు పట్టకుని నిల్చున్న ఆర్పీ సింగ్ కు దానిని అందించాడు. అతడు ఇలా తనకు ధోని స్వయంగా తయారు చేసిన పానీ పూరీని తనకు వడ్డించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక దానిని తీనాల్సిందిగా కూడా ధోని ఆర్సీ సింగ్ ను కోరాడు. ఆ తరువాత ఏం జరిగింది.? అన్న విషయం పక్కనబెడితే.. ధోని నిజజీవితంలోనూ తన స్నేహితులతో ఎంతో సరదాగా వుంటాడని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  MS Dhoni  RP Singh  Pani Puri  Maldives  India captain  Cricket  Viral Videos  

Other Articles