Dhoni is the best captain India has seen: Rohit Sharma టీమిండియా బెస్ట్ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనినే..

Ms dhoni is the best captain india has seen rohit sharma

India vs New Zealand, MS Dhoni, Rohit Sharma, India captain, CHennai Super Kings, ICC trophies, Cricket, latest cricket news, today cricket match, cricket score, sports news, cricket news, sports

India opener Rohit Sharma heaped rich praise on former India skipper MS Dhoni, calling him the best captain India has seen and lauded his calm and composed nature.

టీమిండియా బెస్ట్ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనినే..

Posted: 02/03/2020 10:10 PM IST
Ms dhoni is the best captain india has seen rohit sharma

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్‌ చూసిన అత్యుత్తమ కెప్టెన్‌ ధోనీ అని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. అదే మహేంద్రుడి గొప్పతనమని తెలిపాడు. అలాగే ఐపీఎల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నిలకడగా ప్రదర్శించడానికి ప్రధాన కారణం ధోనీ కెప్టెన్సీయే అని తెలిపాడు. ధోనీ కెప్టెన్ గా టీమిండియాకు అన్ని ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా అందించాడు.

‘ధోనీ ఎలా ఉంటాడో యావత్‌ దేశానికి తెలుసు. అలా ప్రశాంతంగా ఉండడం వల్లే మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగాడు. ఇప్పుడు మనం చూడొచ్చు అతనే అత్యుత్తమ కెప్టెన్‌. అతడి ఖాతాలో అన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. అలాగే ఐపీఎల్‌ టైటిల్స్‌ కూడా. భారత్‌ చూసిన అతిగొప్ప సారథి. ఒత్తిడి సమయంలోనూ ప్రశాంతంగా ఉండే స్వభావమే ధోనీ విజయాలకు కారణం. ఇక యువ బౌలర్లు మైదానంలో ఒత్తిడికి గురైతే వారి వద్ద కెళ్లి ఏం చేయాలో చెప్తాడు. అలా వారికి ధైర్యం కల్పిస్తాడు. ఒక సీనియర్‌ ఆటగాడు జూనియర్‌ ఆటగాడితో అలా కలిసిపోతే వారికి ఉపశమనం పొంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు’ అని రోహిత్‌ ఓ వీడియోలో పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh