‘BCCI was reluctant to tour’: Rashid Latif భారత్-పాక్ క్రికెట్ కు గంగూలీ చోరవ చూపాలి: రషీద్ లతీఫ్

Ganguly can help resume india pakistan bilateral cricket ties rashid latif

Rashid Latif, Sourav Ganguly, India vs Pakistan, India Pakistan, IND vs PAK, IND vs PAK Test, Ganguly, Virat Kohli, Babar Azam, Pakistan Cricket Board, Board of Control for Cricket in India,

Former Pakistan cricketer Rashid Latif claimed that former India captain and current BCCI president Sourav Ganguly played a massive role in India agreeing to tour Pakistan in 2004.

భారత్-పాక్ క్రికెట్ కు గంగూలీ చోరవ చూపాలి: రషీద్ లతీఫ్

Posted: 01/03/2020 09:00 PM IST
Ganguly can help resume india pakistan bilateral cricket ties rashid latif

భారత్‌ పాకిస్థాన్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సంబంధాలు మెరుగవ్వడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చొరవ చూపాలని పాకిస్థాన్ జట్టు మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం ఇరు దేశాల మధ్య కెప్టెన్ గా ఆయన తీసుకున్న చోరవనే మరోమారు బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో కూడా సల్పాలని లతీఫ్ కోరాడు. 2004లో భారత జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు సంబంధించి నాటి కెప్టెన్‌గా ఉన్న దాదానే బీసీసీఐని ఒప్పించి కీలక పాత్ర పోషించాడని చెప్పాడు.

ఒక క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు సాయం చేయగలడని లతీఫ్‌ పేర్కొన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్లు జరగనంతవరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వవని, ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల క్రికెట్‌ మ్యాచ్లు చూడడానికి ఎదురు చూస్తుందని ఆయన చెప్పాడు. అలాగే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సీఈవో వసీంఖాన్‌ కూడా తన వంతు కృషి చేయాలని, పెద్ద జట్లను అక్కడ పర్యటించడానికి ప్రయత్నించాలని అన్నాడు. తద్వారా స్థానిక ఆటగాళ్లకు, పాకిస్థాన్‌ క్రికెట్‌కు ఎంతో ఉపయోగమని లతీఫ్‌ తెలిపాడు.

2004లో భారత్‌.. పాకిస్థాన్లో పర్యటించడానికి బీసీసీఐ నిరాకరించగా అప్పుడు గంగూలీనే చొరవ చూపాడని ఆటగాళ్లను, బీసీసీఐని ఒప్పించాడని గుర్తు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో విజయాలు సాధించడం ద్వారా టీమిండియాకు ఆ పర్యటన తీపి గుర్తుగా మిగిలిపోయిందన్నాడు. ఐదు వన్డేల సిరీస్ ను 3-2 తేడాతో, మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గంగూలీ నాయకత్వంలో టీమిండియా గెలుపొందింది. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌లో దశాబ్దం తర్వాత ఇటీవలే టెస్టు క్రికెట్‌ పునరుజ్జీవం పోసుకుంది. శ్రీలంక జట్టు అక్కడ పర్యటించి టెస్టు సిరీస్ ను కోల్పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles