టెస్టు క్రికెట్ లో సంచలన విజయాలను నమోదు చేసుకుంటున్న టీమిండియా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లోనూ దుమ్మురేపింది. బ్యాటింగ్ జాబితాలో నలుగురు ఆటగాళ్లు టాప్-10లో నిలువగా, బౌలింగ్ లో టాప్ 10 ఇద్దరు ఆటగాళ్లు మెరిసారు. అలాగే ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా తన రెండో స్థానాన్ని స్థిరంగా వుంచుకోగలిగాడు. పరుగుల యంత్రంగా ఖ్యాతి చెందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ ను అక్రమించుకునేందుక కేవలం మూడు పాయింట్ల దూరంలో వున్నాడు.
దీంతో ఆయన తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ (928) తన రేటింగ్ పాయింట్లను భారీగా పెంచుకున్నాడు. టాప్ ప్లేస్ లోని స్టీవ్ స్మిత్ (931) కన్నా కేవలం మూడు పాయింట్ల వెనక ఉన్నాడు. అంతరాన్ని 25 నుంచి 3 పాయింట్లకు తగ్గించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన చారిత్రక డే/నైట్ టెస్టులో కోహ్లీ శతకం (136) బాదిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ద్విశతకం అందుకున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఒక స్థానం ఎగబాకి 9వ ర్యాంకు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 700 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఛెతేశ్వర్ పుజారా (791), అజింక్య రహానె (759) వరుసగా నాలుగు, ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి టాప్-10లో అడుగుపెట్టాడు. న్యూజిలాండ్ టెస్టులో అతడు 91, 28 పరుగులు చేశాడు. చారిత్రక గులాబి బంతి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ప్రధాన ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ నాలుగు స్థానాలు మెరుగై 26వ ర్యాంకు సాధించాడు. ఎనిమిది స్థానాలు ఎగబాకిన లిటన్‌దాస్ 78వ స్థానంలో నిలిచాడు.
బౌలర్ల జాబితాలో ఇషాంత్ శర్మ (716 పాయింట్లు) 17వ ర్యాంకులో ఉన్నాడు. ఉమేశ్ యాదవ్ (672) ఒక స్థానం మెరుగై 21వ ర్యాంకు సాధించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (772) 9, జస్ప్రీత్ బుమ్రా (794) 5వ స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా (725) ఒక స్థానం మెరుగై ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నాడు.
(And get your daily news straight to your inbox)
Jul 02 | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో రికార్డు అనగానే ఆయన తీసిన వికెట్ల సంఖ్య లెక్కకట్టడం ఆపండీ.. అసలు మ్యాటర్... Read more
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more