"Australia didn’t sledge me,”: Kumble అసీస్ నన్నెప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు: అనీల్ కుంబ్లే

I was a friend of warne so australia didn t sledge me anil kumble

Anil Kumble, Shane Warne, Sledging, Australia Cricket Team, Indian Cricket Team, former indian spinner, Anil kumble Australia, Anil kumble sledging, Anil kumble shane warne, Cricket news, sports news, Cricket, sports

Anil Kumble always did well against Australia. He played 20 Tests against the best team in the world in the late 1990s and 2000s and picked 111 wickets, with best bowling figures of 8/141. He ended his career, also against Australia in 2008, with 619 wickets in 132 Tests.

అసీస్ నన్నెప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు: అనీల్ కుంబ్లే

Posted: 11/26/2019 08:03 PM IST
I was a friend of warne so australia didn t sledge me anil kumble

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులోని బౌలర్లు, బ్యాట్స్ మెన్లకు స్లెడ్జింగ్‌ పిచ్చ పీక్స్ లోకి తీసుకెళ్తుంది.. అంతేకాదు.. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ఇది సహజంగా ఆదేశ పర్యటనకు వెళ్లే ప్రతీ ఆటగాడు చెసే పిర్యాదు. 1990 నుంచి 2000 వరకూ క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన కంగారూలు.. తమపై ప్రత్యర్థి ఆటగాడు ఏమాత్రం ఆధిపత్యం చెలాయించినా జీర్ణించుకోలేక స్లెడ్జింగ్ చేసేవారు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే మైదానంలోనే అసందర్భ వ్యాఖ్యలతో స్లెడ్జింగ్ కు పాల్పడేవారు. దీంతో ప్రత్యర్థి ఆటగాడు ఏకాగ్రతను కోల్పోయేలా చేసేవారు.

ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ బాధితుల్లో అప్పటి అగ్రశ్రేణి క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. తనకు మాత్రం ఎప్పుడూ కంగారూలు స్లెడ్జింగ్ చేయలేదని భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తాజాగా వెల్లడించాడు. 1990లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లేకి ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డ్ ఉంది. ఎంతలా అంటే..? ఆసీస్‌పై 20 టెస్టులాడిన కుంబ్లే ఏకంగా 111 వికెట్లు పడగొట్టాడు. కంగారులపై అతని అత్యుత్తమ ప్రదర్శన 8/141కాగా.. టెస్టు కెరీర్‌ని 619 వికెట్లతో కుంబ్లే ముగించిన విషయం తెలిసిందే.

ఇలా ఆసీస్‌పై తాను బంతితో ఆధిపత్యం చెలాయించినా.. వారు ఎప్పుడూ తనపై స్లెడ్జింగ్‌కి దిగే ప్రయత్నం చేయలేదని కుంబ్లే చెప్పుకొచ్చాడు. ‘మీరు షేన్‌వార్న్ ఫ్రెండ్ అయితే మిమ్మల్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేయరు.. ఈ మాటని నేను ఎక్కడ విన్నానో సరిగా గుర్తులేదు. కానీ.. నాపై ఎప్పుడూ ఆస్ట్రేలియా టీమ్‌ స్లెడ్జింగ్‌కి దిగలేదు. దానికి కారణం నేను షేన్‌వార్న్‌కి ఫ్రెండ్ కావడమే’ అని అనిల్ కుంబ్లే వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  Shane Warne  Sledging  Australia Cricket Team  Indian Cricket Team  Cricket  sports  

Other Articles