Virat Kohli Loses Top Spot in Test Rankings ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: టాప్ 10లో ముగ్గురు మనవాళ్లే..!

Steve smith reclaims no 1 test ranking from virat kohli

steve smith, virat kohli, steve smith test ranking, icc test rankings, icc test batting rankings, india vs west indies, ashes 2019, ajinkya rahane, cheteshwar pujara, jasprit bumrah, steve smith, test rankings, virat kohli, cricket news, sports news, cricket, sports

Indian captain Virat Kohli, has lost his number 1 ranking to Former Australian skipper Steve Smith, in the ICC Test rankings for batsmen and settles with the second spot.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: టాప్ 10లో ముగ్గురు మనవాళ్లే..!

Posted: 09/03/2019 07:53 PM IST
Steve smith reclaims no 1 test ranking from virat kohli

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రంగా పేరొందిన విరాట్ కోహ్లీ పధిలపర్చుకున్న నెంబర్ వన్ స్థానాన్ని అసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కైవసం చేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టుమ్యాచ్ లో డకౌట్ కావడంతో ఆయన తన ర్యాంకును దిగజార్చుకుని రెండోస్థానానికి పరమితమయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ టాప్‌ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. స్మిత్ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని వెనక్కినెట్టి టాప్‌కు చేరాడు.

ప్రస్తుతం 904 రేటింగ్‌ పాయింట్లతో స్మిత్‌ అగ్రస్థానంలో ఉండగా.. 903 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడంతో టాప్‌ను చేజార్చుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని రేటింగ్‌ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని టాప్‌ను కాపాడునే అవకాశం ఉంది. 2018 ఆగస్టులో టాప్‌ ర్యాంకులో నిలిచిన స్మిత్‌.. బాల్ టాంపరింగ్ నిషేధం కారణంగా టాప్‌ను కోల్పోయాడు.

నిషేధం అనంతరం పునరాగమనం చేసిన స్మిత్‌ యాషెస్‌లో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో రెండు వరుస సెంచరీలు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌, మూడో టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకోవడంతో నాలుగో టెస్టులో ఆడే అవకాశం ఉంది. కాగా, టాప్ 10లో టీమిండియా నుంచి ముగ్గురు బ్యాట్స్ మెన్లు స్థానం దక్కించుకున్నారు. మొదటి రెండు స్థానాల్లో స్మిత్, కోహ్లీ ఉండగా.. కివీస్ కెప్టెన్ విల్లియంసన్ (878) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా (825) నాలుగో స్థానంలో దక్కించుకున్నాడు. ఇక భారత్ నుంచి మరో బ్యాట్స్ మెన అంజిక్య రహానే (725) కూడా టాప్ 10లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. రహానే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 7వ స్థానంకు చేరుకున్నాడు. కేవలం ఆరు టెస్టులు ఆడిన హనుమ విహారి 40 స్థానాలు ఎగబాకి 30వ స్థానానికి చేరుకున్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్లో జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి దూసుకొచ్చాడు. జాసన్ హోల్డర్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 4వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కాగిసో రబాడ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ల జాబితాలో హోల్డర్ టాప్ లో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jasprit bumrah  steve smith  test rankings  virat kohli  ajinkya rahane  cheteshwar pujara  cricket  sports  

Other Articles