Mithali Raj retires from T20I cricket మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటన.. టీ-20లకు స్వస్తి..

Mithali raj retires from t20is to focus on 2021 odi world cup

Mithali Raj, Mithali Raj T20I retirement, Mithali Raj news, India womens cricket team, India womens cricket, mithali raj t20i cricket, mithali raj announces retirement, sports news, cricket news, sports, cricket

Mithali Raj has announced retirement from T20 Internationals. She led India in 32 T20Is India including 3 Women's T20 World Cups in 2012 (Sri Lanka), 2014 (Bangladesh) and 2016 (India).

మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటన.. టీ-20లకు స్వస్తి..

Posted: 09/03/2019 07:01 PM IST
Mithali raj retires from t20is to focus on 2021 odi world cup

భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. తన కల సాకారం చేసుకోవడం కోసం ఆమె అత్యంత కీలమైన కెరీర్ నే పనంగా పెట్టారు. తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చిన క్రికెట్ కెరీర్ కన్నా ఉన్నతమైన స్వప్నం ఏంటనేగా మీ సందేహం. దేని కోసం 36 ఏళ్ల మిథాలీ.. ఈ నిర్ణయం తీసుకుంది.? క్రికెట్ అంటే కేవలం అంతర్జాతీయ టీ20 కెరీర్ కు ఆమె వీడ్కోలు ప్రకటించింది. ఇంతకీ అమె కల ఏమిటంటారు.? అంటే టార్గెట్ 2021 ఐసీసీ వన్డే వరల్డ్ కప్.

ప్రపంచ కప్ ను సాధించేందుకు ఆమె టీ20 మ్యాచ్ కెరీర్ ను పక్కనబెట్టారు. ఇప్పటివరకు మిథాలీ భారత తరపున మొత్తం 32 టీ20 మ్యాచులు ఆడింది. అందులో మూడు ఎడిషన్లు (2012 (శ్రీలంక , 2014 (బంగ్లాదేశ్, 2016 ఇండియా) మహిళల వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌లు ఆడింది. ‘2006 నుంచి భారత మహిళా క్రికెట్ జట్టుకు టీ20అంతర్జాయ మ్యాచులకు కెప్టెన్ గా వ్యహరిస్తూ వచ్చాను. అంతర్జాతీయ టీ20ల నుంచి వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను. రానున్న 2021 వన్ డే వరల్డ్ కప్ పైనే దృష్టి పెట్టాను. అందుకు తగినట్టుగా రెడీ కావాల్సిన అవసరం ఉంది. నా దేశం కోసం ప్రపంచ కప్ లో విజయం సాధించడమే నా కల. నాకు సాధ్యమైనంత వరకు కష్టపడతా’ అని మిథాలీ చెప్పినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

‘భారత మహిళా టీ20ను ప్రోత్సహించిన బీసీసీఐకి నా కృతజ్ఞతలు. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో హోం సిరీస్ కు సిద్ధమయ్యే భారత మహిళా టీ20 జట్టుకు నా శుభాకాంక్షలు’ అని మిథాలీ ట్వీట్ చేసింది. టీ20 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 2వేలు పరుగుల ల్యాండ్ మార్క్ చేరిన తొలి భారతీయ క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది. మరోవైపు.. భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 హోం సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి-మార్చి 2020లో ఆస్ట్ర్రేలియాలో టీ20 ప్రపంచ కప్ ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithali Raj  retirement  T20s  India womens cricket team  2021 ODI world cup  sports  cricket  

Other Articles

 • Kl rahul dropped for three match test series against south africa

  కేఎల్ రాహుల్ ఔట్.. శుబ్ మన్ గిల్ ఇన్..

  Sep 12 | భారత పర్యటనకు రానున్న దక్షిణాప్రికాతో టెస్టు సిరీస్ అడే టీమిండియా జట్టు ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్టర్లు ఇవాళ ఎంపిక చేశారు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై... Read more

 • Domestic violence case against yuvraj dropped family relieved

  యువరాజ్ పై నమోదైన గృహహింస కేసు ఉపసంహరణ

  Sep 12 | టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేశంలో కోట్లాది మంది... Read more

 • Focussing on my game looking to improve everyday rishabh pant

  వైఫల్యాలను అధిగమిస్తూ.. ఆటపైనే దృష్టి: రిషబ్ పంత్

  Sep 12 | దక్షిణాఫ్రికా సిరీస్‌ను సరికొత్త దృక్పథంతో ఆరంభిస్తానని టీమిండియా యువవికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. ఈ సిరీస్‌ కోసం కఠినంగా సాధన చేశానని వెల్లడించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అంచనాల మేరకు రాణించకపోవడంతో అతడిపై విమర్శలు... Read more

 • Virat kohli s stand to be unveiled at feroz shah kotla

  అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం..

  Sep 09 | క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా పేరుగాంచిన కోహ్లీ సొంతగడ్డపై అపురూపమైన గౌరవానికి నోచుకున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్ కు కోహ్లీ పేరు పెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది.... Read more

 • Mohammad nabi retires from test cricket receives winning farewell

  అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబికి ఘనవీడ్కోలు

  Sep 09 | ఒకప్పుడు పసికూనగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు పెద్ద జట్లకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలోనూ గణనీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ క్రమంగా తన ర్యాంకు మెరుగుపర్చుకుంటోంది.... Read more

Today on Telugu Wishesh