ఒకప్పుడు పసికూనగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు పెద్ద జట్లకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలోనూ గణనీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ క్రమంగా తన ర్యాంకు మెరుగుపర్చుకుంటోంది. ఆఫ్ఘన్ విజయప్రస్థానంలో సీనియర్ ఆటగాళ్ల పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా, మహ్మద్ నబీ అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణిస్తూ జట్టుకు విశేష సేవలందించాడు.
దురదృష్టవశాత్తు కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడిన నబీ ఐదు రోజుల ఫార్మాట్ కు రిటైర్మెంటు ప్రకటించాడు. తమ స్టార్ ఆల్ రౌండర్ కు చివరి టెస్టులో ఆఫ్ఘన్లు అద్భుత విజయంతో సెండాఫ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 224 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించింది. నబీకి ఈ మ్యాచే చివరి టెస్టు మ్యాచ్. ఇకపై ఈ స్పిన్ ఆల్ రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొనసాగుతాడు.
నబీ వయస్సు 34 ఏళ్లు. నబీ తన కెరీర్లో 3 టెస్టులాడి 33 పరుగులు చేసి, 8 వికెట్లు సాధించాడు. 121 వన్డేలాడి 2699 పరుగులు చేశాడు. వాటిలో ఓ సెంచరీ, 14 అర్ధసెంచరీలున్నాయి. 68 టి20 మ్యాచ్ లలో 145.12 స్ట్రయిక్ రేటుతో 1161 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో 128 వికెట్లు తీసిన నబీ, టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. నబీ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడన్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more