Rahul Dravid gets conflict of interest notice ది వాల్ కు నోటీసులు.. విరుచుకుపడ్డ దాదా, భజ్జీ..

Sourav ganguly hits out at bcci after notice to rahul dravid

Rahul Dravid, BCCI, conflict of Interest, notices, India, Sourav Ganguly, Harbhajan singh, National Cricket Academy, Madhya Pradesh Cricket Association, Sanjay Gupta, Chennai Super Kings, Cricket Association of Bengal, Mumbai Indians, Sachin Tendulkar, Sunrisers Hyderabad, Supreme Court, Justice Lodha Panel, VVS Laxman, sports news, cricket news, today match, match score, cricket, sports

Former Indian skipper Sourav Ganguly openly expressing his displeasure over issuance of conflict of interest notice to Rahul Dravid by Ethics Officer, many within the BCCI have now started questioning Justice Lodha panel draft.

ది వాల్ కు నోటీసులు.. విరుచుకుపడ్డ దాదా, భజ్జీ..

Posted: 08/08/2019 03:02 PM IST
Sourav ganguly hits out at bcci after notice to rahul dravid

విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేయడంపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ద్రవిడ్‌కే నోటీసులిచ్చారంటే భారత క్రికెట్‌ను ఇక దేవుడే రక్షించాలని అన్నాడు. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజయ్‌ గుప్తా ఆరోపణలపై అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించాడు. ‘‘భారత క్రికెట్లో విరుద్ధ ప్రయోజనాల అంశం ఇప్పుడు ఓ తమాషా అయిపోయింది. వార్తల్లో ఉండడానికి అదో అత్యుత్తమ మార్గం. భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే రక్షించాలి. విరుద్ధ ప్రయోజనాలపై బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నుంచి ద్రవిడ్‌కు నోటీసు వచ్చింది’’ అని గంగూలీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అతడికి హర్భజన్‌ సింగ్‌ మద్దతిచ్చాడు. ‘‘నిజంగా ద్రవిడ్‌కు నోటీసులిచ్చారా? ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. భారత క్రికెట్‌కు ద్రవిడ్‌ కన్నా మంచి వ్యక్తి దొరకడు.

అలాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడమంటే వాళ్లను  అవమానించడమే. భారత క్రికెట్‌కు వాళ్ల సేవలు అవసరం’’ అని అన్నాడు. భారత జూనియర్‌ కోచ్‌గా, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్‌.. చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్‌లో ఉపాధ్యక్షుడిగా ఉండడం విరుద్ధ ప్రయోజనాలకు కిందికి వస్తుందన్నది సంజయ్‌ గుప్తా ఆరోపణ. అతడు ఇంతకుముందు సచిన్‌, లక్ష్మణ్‌లపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  BCCI  conflict of Interest  notices  India  Sourav Ganguly  Harbhajan singh  cricket  sports  

Other Articles

 • Virat kohli betters ms dhoni record with 30 wins in 50 tests as captain

  మిస్టర్ కూల్ ధోనీ రికార్డును సమం చేసిన విరాటుడు..!

  Oct 14 | దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా స్వదేశంలో అత్యధికంగా 11 టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకొని మరే జట్టుకు... Read more

 • Ex india captain sourav ganguly all set to be president of bcci

  బిసిసిఐ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్న మాజీ కెప్టెన్

  Oct 14 | టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదాపుగా ఖాయమైనట్టే. నాటకీయ పరిణామాల మధ్య గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడిగా నిలిచినట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జై షా కార్యదర్శిగా,... Read more

 • Virat kohli becomes first indian captain to score 40 international hundreds

  కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత.. తొలి కెప్టెన్..

  Oct 11 | సొంతగడ్డపై కోహ్లీసేన రెచ్చిపోతుంది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీలతో మెరిపిస్తే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. తన వీరవిహారం కొనసాగిస్తున్న క్రమంలోనే విరాట్ కోహ్లీ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ తన... Read more

 • Virat kohli trolls kagiso rabada for fielding effort

  దక్షిణాఫ్రికా పేసర్ రబాడాను ట్రోల్ చేసిన కోహ్లీ

  Oct 11 | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అద్భుత శతకం బాదేశాడు. టెస్టుల్లో 26వ శతకం అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతడికిది 69వ సెంచరీ కావడం గమనార్హం.... Read more

 • Virat kohli reveals reason behind replacing umesh yadav with hanuma vihari

  హనుమ విహారి స్థానంలో ఉమేష్ యాదవ్.. ఎందుకంటే..

  Oct 10 | దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా.. తుది జట్టులో ఒక మార్పు చేశాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసిన కోహ్లీ..... Read more

Today on Telugu Wishesh