గెలుపు అంచుల వరకు వెళ్లిన మ్యాచ్.. కళ్లముందే చేజారిపోతుండటంతో అభిమానులకే ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే ఇది అభిమానులకు మాత్రమే పరిమితం అనుకుంటే పోరబాటే.. జట్టును వెన్నంటి వుండి ప్రోత్సహించే తెరవెనుకనున్న వారు ఏమాత్రం అతీతం కాదు. గెలుపు తీరం చేరిన సందర్భంలో ఒక్కసారిగా మ్యాచ్ గతి మారిపోయేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారిపోయింది. ఆయన వీడియో చూసిన హైదరాబాదీ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.
ఢిల్లీ గెలవాలంటే 18 బంతుల్లో 34 పరుగులు కావాలి. అప్పటికే వరుసగా వికెట్లు పడుతుండటంతో సన్ రైజర్స్‌దే విజయం అనుకున్నారంతా. కానీ థంపీ వేసిన 18వ ఓవర్లో ఢీల్లీ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు. ఆ ఓవర్ ముగిసిన తర్వాత సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారింది. దీంతో మ్యాచ్ ఢీల్లీవైపు మొగ్గింది. రిషభ్ పంత్ (49) చెలరేగడంతో ఇంకో బంతి మిగిలి ఉండగానే ఢీల్లీ విజయం సాధించింది. దీంతో సన్ రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించకతప్పలేదు. ఈ మ్యాచులో సన్ రైజర్స్ ఓడిపోవటంతో జట్టు కోచ్ టామ్ మూడీ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
18వ ఓవర్ వేస్తున్న సమయంలో మ్యాచ్ చేజారిపోతున్న విషయాన్ని గ్రహించిన కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టాకున్నారు. మరోవైపు మైదానంలో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం కొంత బావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. అయితే, దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు ఐపీఎల్‌లో తన జట్టు ఓడిపోతే ఏడ్చిన తొలి కోచ్ మూడీ.. ఈ మ్యాచులో ఇదే చేదు సంఘటన.. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఇదో భావోద్వేగం అని పేర్కొంటున్నారు. సన్ రైజర్స్ టైటిల్ గెలవకపోవచ్చు. కానీ, అందరి మనసు గెలిచింది అంటూ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు.
Tom Moody. pic.twitter.com/FACKulM7KB
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2019
(And get your daily news straight to your inbox)
Jul 29 | భారత్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు... Read more
Jul 28 | బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం... Read more
Jul 28 | భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్... Read more
Jul 28 | వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడవ వన్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా... Read more
Jul 18 | ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు... Read more