సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తడబడి.. గెలుపును అస్వాదించాల్సిన మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. కేవలం 12 పాయింట్లతో ప్లే-ఆప్ లోకి వెళ్లినా.. అందివచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఎలిమినేషన్ రౌండ్ లో కీలక మ్యాచ్ లో ఓటమిని చవిచూసి ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్‌లో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓటమిపై సన్ రైజర్స్ సారథి విలియమ్సన్ స్పందించాడు. ఈ మ్యాచ్ మా జట్టుకు నిరాశ మిగిల్చిందన్నాడు.
తమ జట్టు మంచి లక్ష్యాన్నే నిర్దేశించిందని.. ఈ పిచ్‌పై ఎంత కావాలో అంత లక్ష్యం ప్రత్యర్థి ముందు పెట్టాగలిగామని.. అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సమష్టిగా ఆడటంతో వారిని విజయం వరించిందని అన్నారు. ఢిల్లీ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ జట్టుగా రాణించారు. తమ బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో అవకాశాలు జారవిడిచాం. ఇలాంటి వికెట్ పై ఛేదన కొంచెం కష్టంతో కూడుకున్నదే. ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లే తమ నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నారు. అయితే, ఈ మ్యాచ్ లో వందశాతం రాణించామని చెప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కీలకమైన మ్యాచుల్లో ప్రతీ ఆటగాడు రాణించాల్సి ఉంటుందని అన్నారు.
కానీ, అలా జరగలేదని.. వార్నర్, బెయిర్‌స్టో లేకుండా బరిలో దిగిన మ్యాచుల్లోనూ బాగానే ఆడిగలిగిమన్నారు. అయితే, వారి లేని జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌లో దాదాపు విజయతీరాలకు వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్ కూడా అలాంటిదే. గెలుపు వాకిట్లో బోల్తా పడ్డామని విలియమ్స్ సన్ అన్నారు. వచ్చే సీజన్ లో మరింత రాణించేందుకు కృషి చేస్తామని చెప్పారు విలియమ్ సన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలా ఎలిమినేటర్ లో ఓడిపోవడం ఇది మూడో సారి. రెండు సార్లు ఫైనల్ లో అడుగుపెట్టిన ఆ జట్టు 2016తో విజేతగా నిలిచి 2018ల్లో రన్నరప్ గా ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more