Virat Kohli makes mockery of 'Mankading attempt' మనతోనే మన్కాడింగ్.? నరైన్ పై కోహ్లీ కామెడీ రిప్లై..

Virat kohli makes funny gesture as if evading mankading against kkr

India vs Australia ODI, india national cricket team,ind vs aus odi,Ind vs Aus live score,Ind vs Aus,Australia national cricket team, ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, chasing rate, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India’s batting order often under criticism with dwindling returns of the last two years, MS Dhoni was on Friday named Man of the Series for three consecutive half-centuries in a famous 2-1 ODI series win over Australia.

మనతోనే మన్కాడింగ్.? నరైన్ పై కోహ్లీ కామెడీ రిప్లై..

Posted: 04/20/2019 03:33 PM IST
Virat kohli makes funny gesture as if evading mankading against kkr

మన్కడింగ్‌.. ఈ ఐపీల్‌ సీజన్‌లో మార్మోగిన పదం. ఈ సీజన్‌ 12వ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్కిప్పర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారానే రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను ఔట్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ మన్కడింగ్‌ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా..  నిన్న రాత్రి కోల్‌కతా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మన్కడింగ్‌పై సరదా సంఘటన చోటుచేసుకుంది.

బెంగళూరు ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ సునిల్‌ నరైన్‌ వేశాడు. ఈ ఓవర్‌ చివరి బంతిని క్రీజులో ఉన్న స్టాయినిస్‌కు వేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన నరైన్‌ బంతిని వేయలేక మధ్యలోనే ఆగిపోయి వెనక్కి తిరిగాడు. నాన్‌ స్ట్రయికింగ్‌లో కోహ్లీ ఉన్నాడు. అయితే నరైన్‌ మన్కడింగ్‌ చేసేందుకు చూడనప్పటికీ కోహ్లీ వెంటనే బ్యాటును క్రీజులో పెట్టాడు. అంతటితో ఆగకుండా మోకాళ్లపై కూర్చుని బ్యాటును పూర్తిగా క్రీజులో పెడుతూ.. ఇప్పుడు మన్కడింగ్‌ చేయ్‌ అంటూ నరైన్‌ను ఆటపట్టించాడు.

ఈ వీడియోను ఐపీల్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘నాకే మన్కడింగా.. ? నో’ అని విరాట్‌ చెప్పారంటూ ట్వీట్‌లో పేర్కొంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకం బాది ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ను అందుకున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  ODI Series  Team India  Virat Kohli  MS Dhoni  chasing rate  sports  cricket  

Other Articles