Gautam Gambhir is sab about Ambati Rayudu రాయుడి బాధను నేను అనుభవించా: గంభీర్

Ambati rayudu s world cup snub more heartbreaking gautam gambhir

Ambati Rayudu, Gautam Gambhir, Indian Cricket Team, World Cup 2019, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India added the first bilateral ODI series win in Australia to their historic 2-1 Test series triumph after the hosts won the opening match in Sydney by 34 runs and Virat Kohli's team levelled with a six-wicket win in Adelaide.

అంబటి రాయుడి భాధ గుండె పగిలేంత: గంభీర్‌

Posted: 04/16/2019 11:34 PM IST
Ambati rayudu s world cup snub more heartbreaking gautam gambhir

హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక కాకపోవడం బాధ కలిగిస్తోందని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ అన్నాడు. రిషభ్‌పంత్‌ తనకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేదని వెల్లడించాడు. ఇప్పుడు చర్చ జరగాల్సింది అంబటి రాయుడి గురించేనని పేర్కొన్నాడు. వైట్ కలర్ బాల్ క్రికెట్‌లో 48 సగటు, 33 ఏళ్ల వయసున్న క్రికెటర్ ను వదిలేయడం చాలాచాలా దురదృష్టకరం. మిగతా సెలక్షన్‌ నిర్ణయాలతో పోలిస్తే నాకైతే ఇది గుండెపగిలేంత బాధగా అనిపిస్తోంది.

‘రాయుడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. 2007లో నన్ను ఎంపిక చేయనప్పుడు నేనిలాంటి పరిస్థితే ఎదుర్కొన్నా. ప్రపంచకప్ కు ఎంపికవ్వకపోవడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఇది ప్రతి ఒక్కరి కల. ఎంపికవ్వని మిగతా క్రికెటర్లతో పోలిస్తే రాయుడిని చూస్తేనే హృదయం ద్రవిస్తోంది’ అని గంభీర్‌ అన్నాడు. ఏడాదిన్నర కాలం బాగా ఆడిన అంబటి రాయుడు సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్‌ లో రాణించలేదు. దీనిని పరిగణనలోకి తీసుకొని సెలక్టర్లు వేటువేశారని భావిస్తున్నారు.

‘రిషభ్‌పంత్‌ను తీసుకోకపోవడం ఎదురుదెబ్బ ఎలా అవుతుంది? వన్డే క్రికెట్‌లో అతడు నిలకడగా రాణించలేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేదు. దీన్ని ఎదురుదెబ్బ అనొద్దు. పంత్‌ టెస్టు క్రికెట్‌ ఆడాడు. అందుకు సంతోషించాలి. అతడికింకా చాలా వయసుంది. ఎవరైనా సరే వర్తమానంలోనే ఉండాలి. అనుభవం, మ్యాచ్‌లు ముగించడం రీత్యా పంత్‌ కన్నా డీకే మెరుగని సెలక్టర్లు భావించొచ్చు. వన్డే క్రికెట్‌లో చాలాకాలం దినేశ్‌ కార్తీక్‌ బ్యాకప్‌ కీపర్‌గా ఉంటున్నాడు. నా దృష్టిలో మాత్రం సంజు శాంసన్‌ రెండో వికెట్‌కీపర్‌గా బాగుంటాడు. సుదీర్ఘకాలం నాలుగో స్థానంలో ఆడగలడు’ అని గంభీర్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ambati Rayudu  Gautam Gambhir  Indian Cricket Team  World Cup 2019  sports  cricket  

Other Articles