Ashish Nehra trolled after RCB loses by 5 wickets నెహ్రాను అటాడుకుంటున్న అర్సీబీ ఫ్యాన్స్

Ashish nehra can make state topper fail unit test exam fans lash out

IPL 2019, IPL, Ashish Nehra, Virat Kohli, Royal Challengers Bangalore, MI vs RCB, Hardik Pandya, Rohit Sharma, Indian Premier League, RCB cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Royal Challengers Bangalore chose to bowl Pawan Negi in the 19th over when Mumbai Indians needed 22 runs in 12 balls. But the move backfired as Hardik Pandya finished the match in that over itself.

‘‘నెహ్రా టాపర్ ను కూడా ఫెయిల్ చేయగలడు’’

Posted: 04/16/2019 10:52 PM IST
Ashish nehra can make state topper fail unit test exam fans lash out

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క మ్యాచ్ గెలుపుతో గాడిలో పడుతుందన్న సమయంలో ముంబైతో జరిగిన మ్యాచులో బౌలింగ్ కోచ్ తప్పుడు నిర్ణయంతో ఓడిపోవాల్సి రావడంతో ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రాపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. వాంఖడే స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి ఇండియన్స్‌కు చివరి 12 బంతులకు 22 పరుగులు అవసరమయ్యాయి.

క్రీజులో ముంబయి బ్యాట్స్‌మన్‌ హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ ఉన్నారు. 19వ ఓవర్ ను తొలుత ఫాస్ట్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీతో వేయించాలని కోహ్లీ అనుకున్నాడు. అయితే, సైనీకి కాకుండా స్పిన్నర్‌ పవన్‌ నెగికి బంతి ఇవ్వాలని డగౌట్‌లో ఉన్న బెంగళూరు బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా సూచించాడు. కోచ్‌ నిర్ణయం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకొని కోహ్లీ బంతిని పవన్‌ కు ఇచ్చాడు. ఆ ఓవర్ లో చెలరేగి ఆడిన పాండ్య 22 పరుగులు చేసి ఓవర్‌ ముగిసేలోపే మ్యాచ్ ను లాగేసుకున్నాడు.

దీంతో ఆశిష్‌ నిర్ణయంపై అభిమానులు మండిపడుతున్నారు. క్రీజులో పాండ్య, పొలార్డ్‌ వంటి పవర్‌ హిట్టర్లు ఉన్నప్పుడు స్పిన్నర్లకు బౌలింగ్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 140 కి.మీ వేగంతో బౌలింగ్‌ వేసే నవదీప్‌ సైనీకి బౌలింగ్‌ ఇచ్చి ఉంటే బ్యాట్స్ మెన్‌ కొంత ఇబ్బంది పడేవారని అంటున్నారు. బెంగళూరు గెలిచే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆశిష్‌ నెహ్రానే అంటున్నారు. ఆశిష్‌ నెహ్రా తలుచుకుంటే స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ విద్యార్థిని కూడా యూనిట్‌ టెస్టులోనే ఫెయిల్‌ చేయగలడంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2019  IPL  Ashish Nehra  Virat Kohli  Royal Challengers Bangalore  MI vs RCB  sports  cricket  

Other Articles