Rishabh Pant fires back at Tim Paine అసీస్ కెప్టెన్ టిమ్ కు ధీటుగా బదులిచ్చిన పంత్..

Ever heard of a temporary captain rishabh pant gives it back to tim paine

Tim Paine, Rishabh pant, verbal attack, sledging, Melbourne Test, IPL, India vs Australia, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian wicketkeeper Rishabh Pant upped the intensity in his running verbal battle against Australian captain Tim Paine with a string of cutting remarks.

అసీస్ కెప్టెన్ టిమ్ కు ధీటుగా బదులిచ్చిన పంత్..

Posted: 12/29/2018 06:26 PM IST
Ever heard of a temporary captain rishabh pant gives it back to tim paine

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మూడోవ రోజున అసీస్ కెప్టెన్ నుంచి స్లెడ్జింగ్ ఎదుర్కోన్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నాలుగో రోజు అటలో అసీస్ కెప్టెన్ టీమ్ ఫైన్ కు ధీటుగా బదులిచ్చాడు. నిన్న రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. వికెట్ల వెనుక నుంచి టిమ్ పైన్ వరుసగా కవ్వింపులకి దిగుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇక వన్డేలకు ధోని వచ్చేశాడంటూ ఆనయ పేరును ఊటంకిస్తూ.. పంత్ ను ఉడికించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో ‘మహేంద్రసింగ్ ధోని మళ్లీ వన్డే జట్టులోకి వచ్చేశాడుగా. నువ్వు బిగ్ బాష్‌ లీగ్‌లో మా టీమ్ హోబర్ట్‌ హరికేన్స్‌కి ఆడతావా?’ అంటూ అతడి ఏకాగ్రతని దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. కానీ.. వాటికి నిన్న ఎలాంటి బదులివ్వని రిషబ్ పంత్.. తన బ్యాటింగ్‌ని కొనసాగించాడు. కానీ.. ఈరోజు టిమ్‌పైన్ బ్యాటింగ్‌కి రాగానే.. రిషబ్ పంత్ తన నోటికి పనిచెప్పాడు.

‘మయాంక్ అగర్వాల్.. ఈరోజు మన ప్రత్యేక అతిథి వచ్చేశాడు. నువ్వు ఎప్పుడైనా తాత్కాలిక కెప్టెన్ పదం విన్నావా..? అతడ్ని ఔట్ చేయాలంటే నువ్వు ఏం చేయాల్సిన పనిలేదు. అతను మాట్లాడటాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. ఇంకా చెప్పాలంటే.. అతను మాట్లాడటం మాత్రమే చేయగలడు’ అని టిమ్‌పైన్‌ని ఉద్దేశిస్తూ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్‌‌కి చెప్తున్నట్లు రిషబ్ పంత్ వరుసగా కవ్వించే ప్రయత్నం చేశాడు. అదెలానో మీరే చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Tim Paine  Rishabh pant  sledging  Melbourne Test  IPL  India vs Australia  sports  cricket  

Other Articles