Cummins frustrate India as Australia finish on 258/8 బాక్సింగ్ డే టెస్టు: రెండు వికెట్ల దూరంలో టీమిండియా..

India vs australia highlights 3rd test day 4 cummins frustrate india as australia finish on 258 8

Ajinkya Rahane, Aus vs Ind 2018, Aus vs Ind day two score, Aus vs Ind score, Australia vs India, australia vs india 2018, Pat Cummins, cricket score, Ind vs Aus, IND vs AUS Score, India vs Australia, India vs Australia 2018, rohit sharma, virat kohli, cricket, cricket news, sports news, latest sports news, sports

Australia finished Day 4 on 258/8 with Pat Cummins remaining unbeaten on 61. He certainly has been the star player for the Aussies so far in the Test match. India, on the other hand, are kept waiting for the final two wickets despite their best efforts

బాక్సింగ్ డే టెస్టు: రెండు వికెట్ల దూరంలో టీమిండియా..

Posted: 12/29/2018 05:34 PM IST
India vs australia highlights 3rd test day 4 cummins frustrate india as australia finish on 258 8

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో భారత్ జట్టు విజాయానికి మరో రెండు వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజే అసీస్ ను కంగారుపెట్టించి చాపచుట్టేయ్యాలని భావించిన టీమిండియా ఆశలపై టెయిల్ ఎండర్స్ నీళ్లు చల్లారు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌల‌ర్ క‌మ్మిన్స్‌ నీళ్లు చ‌ల్లాడు. బంతితో స‌త్తా చాటి రెండో ఇన్నింగ్స్ లో భార‌త్‌ను స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమితం చేసిన క‌మ్మిన్స్ తాజాగా బ్యాటుతోనూ మెరిశాడు.

అజేయ అర్ధ‌శ‌త‌కం సాధించిన‌ క‌మ్మిన్స్ (61 బ్యాటింగ్‌) భార‌త్ విజ‌యాన్ని మ‌రో రోజుకు వాయిదా వేశాడు. దీంతో మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా 85 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 258 ప‌రుగులు చేసింది. షాన్ మార్ష్ (44), హెడ్ (34), ఖ‌వాజా (33) చెప్పుకొద‌గ్గ ప‌రుగులు చేశారు. క‌మ్మిన్స్ (61 బ్యాటింగ్‌), లియాన్ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా మూడు వికెట్లు ద‌క్కించుకున్నాడు. బుమ్రా, ష‌మీ రెండేసి, ఇషాంత్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అంతుకు ముందు 54/5 తో నాలుగో రోజు బ్యాటింగ్ కొన‌సాగించిన టీమిండియా 106/8 వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగ‌ర్వాల్ (42), పంత్ (33) కీల‌క ప‌రుగులు చేశారు. ఆస్ట్రేలియా విజ‌యానికి మరో 141 ప‌రుగులు అవ‌స‌రం. మ‌రో రెండు వికెట్లు ప‌డితే విజ‌యం భార‌త్ వశం కావడంతో పాటు విరాట్ సేన రికార్డులను కూడా సొంతం చేసుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pat Cummins  Aus vs Ind 2018  day four score  melbourne test  cricket  

Other Articles