Mithali Raj Surpasses Rohit Sharma రోహిత్ శర్మ రిక్డార్డ్ బ్రేక్ చేసిన మిథాలీ రాజ్

Mithali raj surpasses rohit sharma to become leading run getter

Mithali Raj, Rohit Sharma, Ind vs WI, ind vs pak, highest run scorer in t20, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian women’s cricket ace Mithali Raj registered another remarkable record to her name as she surpassed Rohit Sharma to become the highest run-scorer for India in T20I cricket.

రోహిత్ శర్మ రిక్డార్డ్ బ్రేక్ చేసిన మిథాలీ రాజ్

Posted: 11/12/2018 06:50 PM IST
Mithali raj surpasses rohit sharma to become leading run getter

భారత మహిళల జట్టు స్టార్ బ్యాట్స్‌వుమెన్ మిథాలీ రాజ్ టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డుని ఆదివారం రాత్రి బద్దలుకొట్టింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో వెస్టిండీస్‌ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన మిథాలీ రాజ్ (56: 47 బంతుల్లో 7x4).. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 87 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 33.44 సగటుతో 2,207 పరుగులు చేయగా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 56 పరుగుల చేసిన మిథాలీ రాజ్.. మొత్తంగా 2,232 పరుగులతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. దీంతో.. టీ20ల్లో భారత్ టాప్ స్కోరర్‌గా మిథాలీ రాజ్ నిలవగా.. ఆమె తర్వాత రోహిత్, విరాట్ కోహ్లి (2,102), సురేశ్ రైనా (1,605), మహేంద్రసింగ్ ధోని (1,487) నిలిచారు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రికార్డుని వెస్టిండీస్‌తో చెపాక్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడని అంతా ఆశించారు. కానీ.. 4 పరుగులకే ఔటైన రోహిత్ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithali Raj  Rohit Sharma  Ind vs WI  ind vs pak  highest run scorer in t20  sports  cricket  

Other Articles