MSK surprised at Murali Vijay's claim మురళీ విజయ్ అరోపణలపై ఎంఎస్కే విస్మయం

Msk prasad is surprised by the allegations of murali vijay

murali vijay, msk prasad, ravi shastri, virat kohli, harbhajan singh, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

A miffed chairman of selectors MSK Prasad on expressed his surprise after discarded senior India opener Murali Vijay spoke about “lack of communication” from the national selection committee.

మురళీ విజయ్ అరోపణలపై ఎంఎస్కే విస్మయం

Posted: 10/05/2018 06:15 PM IST
Msk prasad is surprised by the allegations of murali vijay

భారత సెలక్టర్లు కనీస సమాచారం ఇవ్వకుండానే తనపై వేటు వేశారని సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ చెప్పడాన్ని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తప్పుబట్టాడు. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో చివరి రెండు టెస్టులకి పృథ్వీ షా‌ని ఎంపిక చేశారు. అయితే.. జట్టు నుంచి తనని తప్పించే ముందు సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మురళీ విజయ్ నిన్న ఆవేదన వ్యక్తం చేశాడు.

అతనితో పాటు ఇటీవల కరుణ్ నాయర్‌, హర్భజన్ సింగ్ కూడా సెలక్టర్ల తీరుపై మండిపడిన విషయం తెలిసిందే. మురళీ విజయ్ వ్యాఖ్యలపై తాజాగా భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ‘జట్టు నుంచి మురళీ విజయ్‌ని తప్పించేటప్పుడు అతనికి సమాచారం ఇవ్వలేదనే మాట అవాస్తవం. జట్టు ఎంపిక సమయంలో నా సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ ఓపెనర్ మురళీ విజయ్‌తో మాట్లాడాడు. అతడ్ని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో కారణం కూడా సవివరంగా చెప్పాడు.

కానీ.. మురళీ విజయ్ తనకి సమాచారం ఇవ్వలేదని నిన్న చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఆడిన మురళీ విజయ్ నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి చేసిన పరుగులు 26 మాత్రమే. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను డకౌటయ్యాడు. దీంతో.. మూడో టెస్టులో అతనిపై వేటు పడగా.. చివరి రెండు టెస్టుల్లో కనీసం జట్టులోకి కూడా సెలక్టర్లు ఈ ఓపెనర్‌ని ఎంపిక చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : murali vijay  msk prasad  ravi shastri  virat kohli  harbhajan singh  sports  cricket  

Other Articles