Kohli scores 24th Test ton in 123rd innings సచిన్ రికార్డును బద్దలుకోట్టిన కోహ్లీ

Kohli 24 test centuries second only to bradman

Don Bradman, India Vs West Indies, Indian Cricket, Prithvi Shaw, Steve Smith, Virat Kohli, India vs West Indies 2018, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India captain Virat Kohli became the quickest batsman to reach 24 Test centuries after the great Donald Bradman early on day two against the West Indies on Friday.

సచిన్ రికార్డును బద్దలుకోట్టిన కోహ్లీ

Posted: 10/05/2018 05:29 PM IST
Kohli 24 test centuries second only to bradman

రాజ్ కోట్ వేదికగా అతిధ్య జట్టు వెస్టిండీస్ తో తొలిటెస్టు‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింద్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కోట్టి.. మరో దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రాడ్ మెన్ తరువాతి స్థానంలో నిలిచాడు. రెండో రోజున బ్యాటింగ్ ను కొనసాగించిన విరాట్‌ కోహ్లీ శతక్కొట్టాడు. తన టెస్టు కెరీర్ లో 24వ శతకం నమోదు చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 24 శతకాలు పూర్తి చేశాడు.

అంతకు ముందు ఈ రికార్డు సచిన్ పేరు మీద ఉంది. సచిన్‌ 124వ ఇన్నింగ్స్ లో 24వ శతకం అందుకున్నాడు. ఇక ప్రపంచ బ్యాట్స్ మెన్ లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 24 శతకాలు పూర్తి చేసుకున్న రికార్డు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్ ‌(66 ఇన్నింగ్స్‌) మీద ఉంది. ఆ తర్వాత ఈ ఘనత కోహ్లీదే. వెస్టిండీస్ తో తొలి టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతోంది. భారత్‌ ధాటిగా ఆడుతోంది. రవీంద్ర జడేజా కెరీర్లో తొలి శతకం సాధించాడు. ఆ వెంటనే జట్టు స్కోరు 649/9 వద్ద సారథి కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Don Bradman  India Vs West Indies  Prithvi Shaw  Steve Smith  Virat Kohli  sports  cricket  

Other Articles