Michael Vaughan mocks Virat Kohli కోహ్లీని.. మైకిల్ వాన్ అంతమాట అంటారా.?

Michael vaughan mocks virat kohli says he s the worst reviewer in the world

India vs England, Virat Kohli, Michael Vaughan, India vs England Test series, India tour of England, IND vs ENG, cricket, cricket news, sports news, latest sports news, sports

Former England captain Michael Vaughan hails Virat Kohli as one of the greatest batsman in the world on one side, he mocked the skipper by calling him 'the worst reviewer in the world'.

కోహ్లీని.. మైకిల్ వాన్ అంతమాట అంటారా.?

Posted: 09/10/2018 06:08 PM IST
Michael vaughan mocks virat kohli says he s the worst reviewer in the world

టీమిండియా రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఓ వైపు కోహ్లీని ప్రశంసిస్తూనే.. అయనపై విమర్శలు కూడా చేశారు. విరాట్ కోహ్లీని ఏకంగా చెత్త అన్న పదాన్ని వినియోగించడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీని అంత తక్కువగా చేసిన విమర్శలు చేస్తారా.. అంటూ ట్రాల్ చేస్తున్నారు. అయితే మైకేల్ వాన్ నిజంగానే అంతమాట అన్నారా.? అన్న డైలిమాలో మరికోందరు ఫ్యాన్స్ వున్నారు.

అయితే విరాట్ కోహ్లీ నిజంగానే ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మనే కానీ చెత్త సమీక్షకుడు కూడా అతడే అని అన్నాడు వాన్‌. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న చివరి టెస్టులో కోహ్లీ రివ్యూలు కోరడమే ఇందుకు కారణం. ఐదో టెస్టు మూడో రోజున ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్వల్ప విరామంలోనే రెండు రివ్యూలను వాడేశాడు. రెండింట్లో ఏ ఒక్కటి కూడా భారత్‌కు అనుకూలంగా ఫలితం రాకపోవడంతో రెండు రివ్యూలను కోల్పోయింది.

10వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతి ఓపెనర్‌ జెన్నింగ్స్‌ ప్యాడ్లను తాకింది. దీంతో కోహ్లీ రివ్యూ కోరగా బంతి స్టంప్స్‌ అవతలవైపు నుంచి వెళ్లడంతో ఆ రివ్యూ వృథా అయ్యింది. అనంతరం 12వ ఓవర్లో మరోసారి జడేజా వేసిన బంతి కుక్‌ ప్యాడ్లను తాకింది. దీంతో మరోసారి కోహ్లీ రివ్యూను ఆశ్రయించాడు. కానీ, ఇక్కడ కూడా కోహ్లీకి నిరాశ తప్పలేదు. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వాన్‌ తన ట్విటర్‌లో ‘విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మన్‌. కానీ, నిజం చెప్పాలంటే ప్రపంచంలో చెత్త సమీక్షకుడు కూడా కోహ్లీనే’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై కోహ్లీ అభిమానులు వాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles