Harbhajan Singh softens stand on Australian trio బాల్ ట్యాంపరింగ్ శిక్షలపై భజ్జీ తాజా స్పందనిదే..

Harbhajan singh takes u turn after aussie trio handed heavy sanctions

ball tampering, ball tampering scandal, cricket australia, harbhajan singh, Gautam Gambhir, harbhajan singh, south africa vs australia, steve smith, david warner, cricket, cricket news, sports news, latest sports news, sports

India cricketer Harbhajan Singh seems to have taken a softer stand on the punishments handed out to Australia cricketers Steve Smith, David Warner and Cameron Bancroft in the ball-tampering saga that has shocked the entire cricketing fraternity.

బాల్ ట్యాంపరింగ్ శిక్షలపై భజ్జీ తాజా స్పందనిదే..

Posted: 03/30/2018 08:18 PM IST
Harbhajan singh takes u turn after aussie trio handed heavy sanctions

బాల్ ట్యాపరింగ్ వివాదంలో చిక్కుకున్న అస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, యువ అటగాడు బాన్ క్రాప్ట్ లపై ఐసీసీ విధించిన శిక్ష సరైందని అభిప్రాయపడిన టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్.. తాజగా క్రికెట్ అస్ట్రేలియా విధించిన శిక్షపై తనదైన శైలిలో స్పందించాడు. ఐసీసీ ఒక్క టెస్టు మ్యాచ్ నుంచి మాత్రమే సస్పెండ్ చేయడంతో.. ఏడాది పాటు వేటు వేయడాన్ని కూడా తప్పబట్టిన ఆయన బాల్ ట్యాపరింగ్ చేస్తే ఏఢాది పాటే వేటా..? అంటూ ఐసీసీ నిర్ణయంపై నిప్పులు చెరిగిన భజ్జీ.. వారి శిక్షల తీరును కూడా ప్రశ్నించాడు.

'వావ్ ఐసీసీ. ట్యాంపరింగ్‌ వివాదంలో గొప్ప శిక్షే వేశారు. అన్ని ఆధారాలున్నా బాన్‌ క్రాఫ్ట్‌ పై నిషేధం లేదు. గతాన్ని మర్చిపోయారా? మితిమిరి అప్పీల్‌ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌ లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కో మ్యాచ్‌ నిషేధం విధించారు. 2008 సిడ్నీ టెస్టులో ఎలాంటి ఆధారాలు లేకుండానే జాతి వివక్ష వ్యాఖ్యలంటూ (మంకీగేట్‌ వివాదం) తనపై మోపీ మూడు టెస్టుల వేటేశారు. వ్యక్తిని, అతను ప్రాతినిధ్యం వహించే జట్టును బట్టి అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా?' అంటూ ట్వీట్టర్ మాధ్యమంగా హర్భజన్ సింగ్ నిలదీశాడు. మరో విధంగా ఐసీసీ శిక్షలపై వారిని నిలదీశాడు.

తాజాగా యూ టర్న్ తీసుకుని... 'కేవలం బాల్ ట్యాంపరింగ్‌ కు పాల్పడ్డారన్న కారణంగా ఆసీస్ ఆటగాళ్లపై ఏడాది నిషేధం విధించడం జోక్‌. వాళ్లు ఏ నేరానికి పాల్పడ్డారని ఇంత పెద్ద శిక్ష వేశారు? ఆట నుంచి ఏడాది పాటు దూరం చేయడం తెలివి తక్కువ నిర్ణయం. ఒక టెస్ట్ సిరీసో లేక రెండు సిరీస్‌ లకు నిషేధం పరిమితం చేస్తే సరిపోయేది. కానీ ఇది దారుణం. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ లపై నిషేధం గడువును క్రికెట్ స్ట్రేలియా తగ్గించాలి' అంటూ తాజాగా హర్భజన్ ట్వీట్ చేశాడు.

wow @ICC wow. Great treatment nd FairPlay. No ban for Bancroft with all the evidences whereas 6 of us were banned for excessive appealing in South Africa 2001 without any evidence and Remember Sydney 2008? Not found guilty and banned for 3 matches.different people different rules

— Harbhajan Turbanator (@harbhajan_singh) March 29, 2018

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles