బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కఠిన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అస్ట్రేలియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా..? అన్న ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతున్న క్రమంలో దేశ పరువును తీసిన కెప్టెన్, వైస్ కెప్టెన్ లపై ఏడాది పాటు వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించిన యువ ఆటగాడు కేమరాన్ బెన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. తాను విధించిన శిక్షలపై అప్పీలుకు సీఏ వారికి వారం రోజుల గడువు ఇచ్చింది.
బాల్ ట్యాంపరింగ్ ఉదంతానికి ఈ ముగ్గురే కారకులంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు శిక్షలు ఖరారు చేసింది. ఈ క్రమంలో శిక్షా కాలం ముగిసిన తరువాత మరో ఏడాది పాటు అంటే రెండేళ్ల పాటు స్మిత్ కు కెప్టెన్సీ పగ్గాలను అందించవద్దని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక వార్నర్ కు తన క్రికెట్ కెరీర్ లోనే ఎప్పటికీ జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతలను అందించేదిలేదని కూడా క్రికెట్ అస్ట్రేలియా తేల్చి చెప్పింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు క్లబ్ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన సీఏ.. వాటి అభివృద్ధి కోసం 100గంటల పాటు పని చేయాలని సూచించింది.
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా సఫారీలతో జరిగిన మ్యాచ్ బాల్ ట్యాంపరింగ్ పై సుమారు నాలుగు రోజుల తరువాత ఈ మేరకు క్రికెట్ అస్ట్రేలియా నిర్ణయాన్ని వెలువరించింది. మూడో టెస్టులో బంతి రివర్స్ స్వింగ్ అయ్యేందుకు బాన్‌క్రాఫ్ట్ పసుపు రంగు టేపుతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ కెమెరా చేతికి చిక్కాడు. మైదానంలోని తెరపై ఇందుకు సంబంధించిన దృశ్యాలను చూపించగానే అప్రమత్తమైన బాన్‌క్రాఫ్ట్ దాన్ని ప్యాంటులో వేసుకుంటూ కనిపించాడు. బాల్ టాంపరింగ్ జరిగిందని తేలడంతో వెంటనే రంగంలోకి దిగిన ఐసీసీ వారికి చిన్న శిక్షలను వేసి మమ అనిపించుకోగా, క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఇవాళ కఠిన శిక్షలను వేసింది. ఇక దీంతో వీరు వరల్డ్ కప్ అడే అవకాశం కూడా లేదన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more