Smith Warner Won't Take Part in IPL 2018: BCCI బాల్ ట్యాపరింగ్ చేసినవాళ్లకు ఐపీఎల్ లోకి నో-ఎంట్రీ..

Steve smith and david warner banned from ipl 2018 by bcci

Cameron Bancroft, Cricket Australia, David Warner, Indian Premier League, IPL 2018, Rajasthan Royals, Rajeev Shukla, Steve Smith, Sunrisers Hyderabad, trending news, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Smith and Warner were supposed to captain their respective franchises Rajasthan Royals and Sunrisers Hyderabad but had stepped down in the wake of the ball-tampering scandal.

బాల్ ట్యాపరింగ్ చేసినవాళ్లకు ఐపీఎల్ లోకి నో-ఎంట్రీ..

Posted: 03/28/2018 08:04 PM IST
Steve smith and david warner banned from ipl 2018 by bcci

బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌ను ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, డేవిడ్ వార్నర్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఇప్పటికే తప్పించాయి. కాగా, తాజాగా క్రికెట్ అస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా తాజా నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను అడకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసిసిఐ నిర్ణయం తీసుకుందని, వాళ్లిద్దరూ ఐపీఎల్ సీజన్ 11లో అడరని వెల్లడించింది.

బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరీ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ అస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, దీంతో అదే నిర్ణయాన్ని తాము ఐపీఎల్ లో కొనసాగించనున్నామని చెప్పారు. మరోవైపు అమితాబ్‌ చౌదరీ వ్యాఖ్యలను ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా కూడా ధ్రువపరిచారు. ‘స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో సదరు ప్రాంఛైజీలు మరో ఆటగాడిని తీసుకోవచ్చని’ తెలిపారు. కాగా ఇప్పటికే స్మిత్ స్థానంలో రహానేకు రాజస్థాన్ పగ్గాలను అప్పగించగా, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలు ధావన్ కు అప్పగిస్తారా..? లేక మరో వ్యక్తిని ఎంపిక చేస్తారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles