Rahane Compares Sledging To Honking క్రికెట్ సహా డ్రైవింగ్లో అవంటే అయిష్టనం: రహానే

I don t like sledging and car horn honking says ajinkya rahane

India Test vice-captain, team india, ajinkya madhukar rahane, ajinkya rahane, sledging, horn honking, virat kohli, ravi shasri, Cricket news, sports news, sports, latest sports updates, cricket

India Test vice-captain Ajinkya Rahane compared sledging to horn honking and said that he is not fond of both. "Just as I don't like sledging (on the cricket field), I also don't like car honking while driving," said Rahane.

క్రికెట్ సహా డ్రైవింగ్లో అవంటే అయిష్టనం: రహానే

Posted: 03/23/2018 06:27 PM IST
I don t like sledging and car horn honking says ajinkya rahane

టీమిండియా టెస్టుక్రికెట్‌ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు తనకు అయిష్టమైనవేంటో చెప్పాడు. అయితే ప్రధానంగా తనకు క్రికెట్ లో ఇష్టముండని విషయమేంటంటే.. స్లెడ్జింగ్‌ చేయడమని నిర్మోహమాటంగా చెప్పాడు. ఓ వైపు కెప్టెన్ విరాట్ కోహ్లీకి దూకుడు ఎక్కవని, స్లెడ్జింగ్ చేసిన ప్రత్యర్థులకు తన బ్యాటుతో పాటు నోటితో కూడా బదులిస్తాడన్న విషయం తెలిసిన భారత క్రికెట్ అభిమానులకు రహానే కు ఇష్టం ఉండని విషయాలు కూడా తెలిసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మైదనాంలో స్లెడ్జింగ్ ను ఆయన డ్రైవింగ్ లో హారన్ మ్రెగించడంతో పొల్చాడు. క్రికెట్ లో స్లెడ్జింగ్, డ్రైవింగ్ లో హారన్ మ్రోగించడం తనకు ఇష్టముండవని చెప్పాడు. అయితే అత్యవసర సమయాల్లో మాత్రం హారన్ ఎలాగో తప్పదు అని చెప్పాడు రహానె. మహారాష్ట్ర మోటార్ వెహికల్ శాఖ ‌‌(ఎమ్వీడీ) రహదారి భద్రత, శబ్ద కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 24 ముంబయిలోని వాంఖడే మైదానంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రహానే.. ముంబయి లాంటి మెట్రో నగరాల్లో శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద సమస్యగా మారిందని అన్నాడు. రోడ్ సేఫ్టీ ఎలెవన్‌-నో హాంకింగ్ ఎలెవన్ మధ్య  అధికారులు ఓ టీ20 మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. యువరాజ్‌ సింగ్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్య, సురేశ్‌ రైనా కూడా ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచులో ఆడనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles