Vinod Kambli touched Sachin's feet సచిన్- వినోద్ కాంబ్లీల తాజా వీడియో వైరల్

Twitterati gets blown away by sachin tendulkar vinod kambli s bromance

Sachin Tendulkar, Twitter, Vinod Kambli, Mumbai T20 League, Triumph Knights Mumbai North East, Shivaji Park Lions, Vinod Kambli. latest cricket news, sports news, sports, cricket

Indian cricket icon Sachin Tendulkar and his long-time friend Vinod Kambli were reunited during the final of the Mumbai T20 League between Triumph Knights Mumbai North East and Shivaji Park Lions.

సచిన్- వినోద్ కాంబ్లీల తాజా వీడియో వైరల్

Posted: 03/23/2018 03:35 PM IST
Twitterati gets blown away by sachin tendulkar vinod kambli s bromance

క్రికెట్ దేవుడిగా ఖ్యాతిగడించిన భారత క్రికెట్ దిగ్గజం, సచిన్‌ టెండూల్కర్‌ తన బాల్యమిత్రుడితో వ్యవహరించిన శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బాల్య స్నేహితుడు వినోద్‌ కాంబ్లీ చేసిన పనిని అడ్డుకున్న సచిన్.. గురించి ఆయన స్వభావం గురించి ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇద్దరూ స్కూల్ దశలోనే రికార్డులను క్రియేట్ చేసి హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరికి స్నేహం చిగురించి టీమిండియా జట్టులో వరకు కొనసాగింది.

ఆ తరువాత విరిద్దరి మధ్య పోరపచ్చాలు వచ్చి..  ఇద్దరూ మధ్య స్నేహబంధం దూరమైంది. ఆ తరువాత సచిన్ తాను రిటైరయ్యాక తన మిత్రులందరికీ ఒక్కక్కరిని పిలిచి వారికి డిన్నర్ ఇచ్చారు. ఇలానే వినోద్ కాంబ్లీ కూడా ఆయన పోన్ చేసి మళ్లీ తమ స్నేహబంధాన్ని చిగురింపచేశారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై టీ20 లీగ్ ముగింపు కార్యక్రమం సందర్భంగా అతిధులుగా వచ్చిన సచిన్, గవాస్కర్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఫైనల్ లో ఓటమి పాలైన శివాజీ పార్క్ లయన్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న కాంబ్లీ మెడల్ అందుకోవడానికి వచ్చి, సచిన్‌ పాదాలను తాకే ప్రయత్నం చేయగా, సచిన్, కాంబ్లీని అడ్డుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సచిన్ మంచి మనన్సును వ్యక్తిత్వాన్ని నెట్ జనులు అభినందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles