Shankar, Unadkat help India collect first points in tri-series బంగ్లాను బెంబేలెత్తించిన టీమిండియా కుర్రాళ్లు..

India vs bangladesh 2nd t20i india beat bangladesh by six wickets

Bangladesh, suresh raina, Bangladesh vs India,Cricket,India,India vs Bangladesh,Jaydev Unadkat,Mahmudullah,Manish Pandey,Nidahas Trophy,Nidahas Trophy 2018,Rohit Sharma,Shikhar Dhawan,T20I,Vijay Shankar, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India produced an all-round show to thump Bangladesh by six wickets in their second match of the Nidahas Trophy Twenty20 International (T20I) cricket tri-series in Colombo.

బంగ్లాను బెంబేలెత్తించిన టీమిండియా కుర్రాళ్లు..

Posted: 03/09/2018 01:42 PM IST
India vs bangladesh 2nd t20i india beat bangladesh by six wickets

నిదహాస్ ట్రోఫీలో భాగంగా రెండో మ్యాచులో బంగ్లాదేశ్ ను ఎదుర్కోన్న టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ గబ్బర్ గా పిలువబడే శిఖర్ ధావన్ తన బ్యాటు నుంచి పరుగుల వరదను సృష్టించడంతో అర్థశతకాన్ని నమోదు చేయడంతో పాటు టీమిండియా విజయతీరాలకు కూడా చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ధేశించిన 140 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా.. అదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయినా  ఏమాత్రత తడబాటుకు గురికాకుండా తొలి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టును తమ పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టారు భారత యువ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, విజయ్ శంకర్. 2.4 ఓవర్ వద్ద 20 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు సౌమ్య సర్కార్ (14) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దానికి మరో 15 పరుగులు జోడించాక మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (15) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాతి నుంచి బంగ్లాదేశ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది.

లిటన్ దాస్ (34), షబ్బీర్ రహ్మాన్ (30) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి భారత్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో 140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (17) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్ కూడా నిలదోక్కుకోలేకపోయాడు. అయితే మరో ఎండ్ లో వున్న శిఖర్ ధావన్ మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన బ్యాటుతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కాగా సీనియర్ అటగాడు సురేశ్ రైనా నుంచి అతనికి మంచి సహకారం లభించింది. అర్థశతకం తరువాత ధావన్, రైనాలు కూడా పెవీలియన్ బాట పట్టారు. దీంతో మనీష్ పాండే, దినేష్ కార్తీక్ లు జట్టుకు విజయాన్ని అందించారు. రెండు కీలక వికెట్లు తీసిన విజయ్ శంకర్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles