Backing Kohli led to my removal as chief selector: Dilip Vengsarkar నా పదవికి ఎసరు తెచ్చింది.. కోహ్లీ సిఫార్సే

Backing of virat kohli in 2008 led to my removal as chief selector dilip vengsarkar

India vs Sri Lanka, Virat Kohli, Vengsarkar, N Srinivasan, MS Dhoni, kohli badrinath, Gary Kirsten, Dilip Vengsarkar, Badrinath, cricket news, sports news, latest sports updates, sports, cricket

Former India captain Dilip Vengsarkar has hinted that his term as chief selector of the BCCI’s national selection committee was cut short in 2008 owing to his backing of current Indian skipper Virat Kohli.

నా పదవికి ఎసరు తెచ్చింది.. కోహ్లీ సిఫార్సే

Posted: 03/08/2018 03:26 PM IST
Backing of virat kohli in 2008 led to my removal as chief selector dilip vengsarkar

అప్పట్లో విరాట్ కోహ్లీని అడ్డుకున్నది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీనే అంటూ గతానికి సంబంధించిన అంశాలను గుర్తుకుతెచ్చుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కర్. ఇప్పుడు టీమిండియా జట్టు సారధిగా వున్న విరాట్‌ కోహ్లీకి విజయానికి కీలక సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ధోని.. తొలినాళ్లలో కోహ్లీని జట్టులోకే రానీయకుండా అడ్డుకున్నాడని వెంగ్ సర్కార్ అన్నాడు. కోహ్లీని జట్టులోకి సిఫార్సు చేసినందుకుగాను తన పదవికే ఎసరు వచ్చిందని ఆయన తన అవేదనను వ్యక్తం చేశారు.

సరిగ్గా పదేళ్ల ముందు 2008లో టీమిండియా శ్రీలంక పర్యటనకు జట్టును ఎంపిక చేస్తున్న క్రమంలో కోహ్లీ పేరును తాను సిఫార్సు చేశానని వెంగసర్కార్ అన్నారు. అందుకు ఆ ఏడాది కోహ్లీ నాయకత్వంలోని అండర్‌-19 భారత జట్టు ప్రపంచకప్‌ గెలివడమే కాకుండా.. ఇండియా-ఎ తరఫున బ్రిస్బేన్ మ్యాచులో కోహ్లీ 123 పరుగులతో నాటౌట్ గా నిలివడం కూడా కారణమని చెప్పానన్నాడు. అయితే తన నిర్ణయాన్ని.. అప్పటి కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌, కెప్టెన్‌ ధోనీ ఒప్పుకోలేదని అన్నాడు. బద్రీనాథ్ పై వేటు పడుతుందనే వారు దానిని అడ్డుకున్నారని, ఈ విషయంలో శ్రీనివాసన్ తనను ప్రశ్నించారని కూడా చెప్పుకోచ్చారు వెంగ్ సర్కార్.

అంతకు ముందు జరిగిన ఓ టోర్నీలో బద్రీనాథ్‌ 800 పరుగులు చేశాడు. మరి అతనికి ఎందుకు స్థానం ఇవ్వకూడదు అని తనతో వాదనకు కూడా దిగాడని, అయితే అతనికి కూడా అవకాశం ఇస్తానని చెప్పగా, ఇప్పటికే అతని వయస్సు 29.. ఇక మీరు అవకాశం ఇచ్చే నాటికి ముఫై కూడా రావచ్చు. క్రీడాకారుడి జీవితం, భవిష్యత్తుతో అటలు వద్దు అంటూ వాదించాడని వెంగీ చెప్పుకోచ్చారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు. ఆ మరుసటి రోజే శ్రీకాంత్‌ను తీసుకొచ్చి సెలక్టర్‌గా నియమించి నా కాల పరిమితి ముగిసిందని చెప్పారని గుర్తుచేసుకున్నాడు వెంగ్ సర్కార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Virat Kohli  N Srinivasan  MS Dhoni  Gary Kirsten  Dilip Vengsarkar  Badrinath  cricket  

Other Articles