Dhoni breaks world record in T20 cricket ధోని జాబితాలో చేరిన మరో ప్రపంచ రికార్డు..

Ms dhoni s world record goes unnoticed in india s t20i win

1st T20, India vs South Africa, MS Dhoni, Kumar Sangakkara, Wicket-keeping, most catches, world record, T20 cricket, virat kohli, India v/s South Africa, Ind vs SA, Shikhar Dhawan, Bhuvneshwar Kumar, South Africa v India at Johannesburg, India tour of South Africa, India cricket, South Africa cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

Mahendra Singh Dhoni added yet another feather to his illustrious cap as he broke the record for most catches by a wicket-keeper in T20 cricket during the first T20I between India and South Africa.

మిస్టర్ కూల్ ధోని జాబితాలో చేరిన మరో ప్రపంచ రికార్డు..

Posted: 02/19/2018 03:45 PM IST
Ms dhoni s world record goes unnoticed in india s t20i win

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ తన పేరున ఇప్పిటికే నమోదైన పలు రికార్డులలో మరో కలికితురాయి చేరింది. ఆయన తజాగా మరో  ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. వికెట్ల వెనుక నుంచి చక్రం తిప్పే ధోని.. ప్రత్యర్థులెవరైనా తన జట్టు గెలుపులో కీలక భూమిక పోషిస్తున్నాడు. తనకు కావాల్సిన విధంగా బంతులు వేయమని చివరి క్షణంలో వేయించుకుని వారిని పెవిలీయన్ కు పంపేందుకు ముఖ్యపాత్ర పోషిస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే క్రితం రోజున అతిథ్యజట్టు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచులో హెండ్రిక్స్ బ్యాటుకు తగలి వచ్చిన బంతిని క్యాచ్ పట్టిన ధోని తన పేరును అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు.

టీ 20 పోట్టి ఫార్మాట్ క్రికెట్ గా పేరొందిన టీ20 క్రికెట్ మ్యాచులో అత్యధిక క్యాచులు అందుకున్న వికెట్‌ కీపర్ గా ధోని రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కరను వెనక్కినెట్టిన ధోని తన పేరున ఈ ఘనతను నమోదు చేసుకున్నాడు. అదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్‌ హెండ్రిక్స్‌(7) భువనేశ్వర్‌ బౌలింగ్ లో వికెట్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీ20 ఫార్మెట్ క్రికెట్ లో 134వ క్యాచ్ ను అందుకున్న ధోని పేరిట.. అత్యదిక క్యాచులు పట్టిన వికెట్ కీపర్ గా రికార్డు నమోదైంది. అంతకుముందు ఈ రికార్డు 133 క్యాచులను పట్టుకున్న శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర పేరున వుండింది.

275 టీ20ల్లో ధోనీ ఇప్పటి వరకు మొత్తం 139 క్యాచ్ లు అందుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌(123), కమ్రాన్‌ అక్మల్‌(115), రామ్ దిన్‌(108), ఓజా(106) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్ల జాబితాల్లో ధోనీ తృతీయ స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ ఇప్పటి వరకు 601 క్యాచులు, 174 స్టంపింగ్లు చేశాడు. మార్క్‌ బౌచర్‌ (952), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌( 813) క్యాచ్ లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles