Injury Scare For Virat Kohli In First T20 రెండో టీ20 ముంగిట టీమిండియాకు ఎదురుదెబ్బ.?

Kohli walked off field due to stiffness in glute no injury concern

1st T20, India vs South Africa, virat kohli, the wanderers stadium, johannesburg, centurion, South Africa vs India 2018, virat kohli, India v/s South Africa, Ind vs SA, Shikhar Dhawan, Bhuvneshwar Kumar, South Africa v India at Johannesburg, India tour of South Africa, India cricket, South Africa cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

Virat Kohli limped off the field before India completed another dominant performance over South Africa in the first Twenty20 international at the Wanderers Stadium

రెండో టీ20 ముంగిట టీమిండియాకు ఎదురుదెబ్బ.?

Posted: 02/19/2018 04:23 PM IST
Kohli walked off field due to stiffness in glute no injury concern

వన్డే సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకుని టీ20 సిరీస్ పై దృష్టిసారించిన టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్ లోనూ తొలిమ్యాచ్ గెలిచి పైచేయి సాధించిన టీమిండియా రెండో టీ20కి అదే జోరును కొనసాగిస్తుందా..? లేక చతికిల పడుతుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు కారణం.. సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనున్న రెండో టీ20లో పరుగుల మిషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అడే అవకాశాలు సన్నగిల్లడమే. అదేంటి విరాట్ కోహ్లీ అడకపోవడమేమిటి అంటారా.? సఫారీలతో జరిగిన తొలి టీ20లో ఆయన గాయపడ్డారు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు గాయపడ్డారు. అయితే చేతికి, చేతి వేళ్లకు గాయాలు కాకపోయినా.. కాలినొప్పి మాత్రం అయనను వేధించింది. దీంతోనే ఆయన శంసీ బౌలింగ్ లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగారు. ఇక టీమిండియా బ్యాటింగ్ ముగించిన తరువాత అతిధ్యజట్టు బ్యాటింగ్ కొనసాగుతున్న క్రమంలో వారు 13వ ఓవర్ ను ఎదుర్కొంటున్న క్రమంలో కూడా విరాట్ కోహ్లీ కాలి నొ్పితో బాధపడ్డారు. నోప్పి మరీ ఎక్కువ కావడంతో పీల్డింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. దీంతో అప్పటికే ఓటమి అంచుల మధ్య వున్న సౌతాఫ్రికాపై టీమిండియా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో అయన మైదానాన్ని వీడాడు.

కాగా, అతని కాలి నోప్పి తగ్గిందా..? లేదా..? ఈ క్రమంలో ఆయన బుధవారం జరగనున్న రెండో టీ20లో అడతారా..? లేదా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే రేపటి వరకు కానీ ఎలాంటి విషయాలు వెలుగులోకి రాకపోవచ్చు. జట్టు యాజమాన్యం కూడా ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో అసలు విరాట్ అడతాడా..? లేదా...? అన్న విషయంలో ఇంకా స్పష్టత కొరడవడింది. కాగా, విరాట్ వైదొలిగితే మాత్రం రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  virat kohli  the wanderers stadium  johannesburg  centurion  cricket  

Other Articles