Ravindra Jadeja hits six sixes in an over అద్భుత ఫీటుతో యువీ, శాస్త్రీల సరసన చోటు

Ravindra jadeja hits six sixes in an over ahead of south africa tour

Inida vs sri lanka, Inida vs south africa, ravindra jadejja, ravi shastri, yuvraj singh, inter district match, ind vs sa, delhi, team India, south africa, six sixes, elite list, cricket, sports news, cricket news, latest cricket news, latest sports news, latest news

Swashbuckling all-rounder Ravindra Jadeja smashed six sixes in an over in a local cricket match, sending selectors a reminder of his short-form prowess after being omitted from India's recent

అద్భుత ఫీటుతో యువీ, శాస్త్రీల సరసన చోటు

Posted: 12/16/2017 07:30 PM IST
Ravindra jadeja hits six sixes in an over ahead of south africa tour

టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. టీమిండియా తరపున కేవలం రవిశాస్త్రీ, యువరాజ్ సింగ్ లు మాత్రమే చేసిన అరుదైన ఫీటును చేసి.. వారి సరసన స్థానాన్ని సంపాదించాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే జట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన జడేజా ప్రస్తుతం సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్సీఏ) నిర్వహించిన అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడేజా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ ల పక్కన స్థానాన్ని సంపాదించాడు

జామ్ నగర్ జట్టు తరపున ఆడుతున్న రవీంద్ర జడేజా.. అమ్రేలీ జట్టుతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ కు దిగి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అల్ రౌండర్ గా పేరొందిన జడేజా గ కొన్నాళ్లుగా తన చేతి నుంచి జాలువారే బంతులకే పనిచెబుతున్నాడు.. తప్ప తన బ్యాటు నుంచి పరుగులను రాబట్టలేకపోతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించాడో ఏమో కానీ.. ఇవాళ తన బ్యాటు నుంచి పరుగుల వరదను రాబట్టాడు. 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు.

15వ ఓవర్ లో ఆఫ్ స్పిన్నర్ నీలం వంజాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. వేసిన ఆరు బంతులను సిక్సర్లు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా దెబ్బకు అమ్రేలీ జట్టు పరాజయం పాలైంది. కాగా, గతంలో రవిశాస్త్రి, యువరాజ్ సింగ్‌లు ఈ ఘనత సాధించారు. 1985లో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగిన రవిశాస్త్రి బరోడా బౌలర్ తిలక్‌రాజ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles