Mohammed Shami will be in action on Day 5 విజయం దిశగా విరాట్ సేన పయనం..

India vs sri lanka 3rd test mohammed shami will be in action on day 5 confirms shikhar dhawan

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, eden gardens, kolkata, Sri Lanka, Virat Kohli, TKedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, sports news,sports, latest sports news, cricket news, cricket

The ongoing third Test at Delhi has already been making headlines with players feeling sick owing to the alarming levels of pollution in the city.

విజయం దిశగా విరాట్ సేన పయనం..

Posted: 12/05/2017 07:49 PM IST
India vs sri lanka 3rd test mohammed shami will be in action on day 5 confirms shikhar dhawan

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా పర్యాటక జట్టు శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ విజయం శగా పయనిస్తోంది. నాల్గవ రోజున చివరి రోజు మరో 7 వికెట్లు పడగొడితే విరాట్ సేనను విజయం వరింస్తుంది. ఇవాళ ఆట అనేక మలుపులు తిరిగింది. మూడో రోజు లంక బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్‌ టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా మారిపోయింది. బౌలింగ్ కు సహకరించింది. అయినా పట్టు విడువని కోహ్లీసేన మరోసారి దుమ్మురేపి ఒక దశలో రెండో ఇన్నింగ్స్ ను కూడా డిక్లేర్ చేసింది. ఇక అట ముగిసే సమయానికి లంక మూడు వికెట్లను నష్టపోయింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 356/9తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో 26 పరుగులకే ఆలౌటైంది. సారథి చండిమాల్‌ (164; 361 బంతుల్లో 21×4, 1×6) కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను భారత్‌ 246/5కు డిక్లేర్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో లంకకు 410 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టు ఆట ముగిసే సరికి 31/3తో నిలిచింది. 379 పరుగుల దూరంలో నిలిచింది. ధనంజయ డిసిల్వా (13; 30 బంతుల్లో 1×6), ఏంజెలో మాథ్యూస్‌ (0) క్రీజులో ఉన్నారు.

బ్యాటింగ్ కు అనుకూలించని పిచ్ పై రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీసేన తెలివిగా ఆడింది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్ లో శిఖర్‌ ధావన్‌ (67; 91 బంతుల్లో 5×4, 1×6), విరాట్‌ కోహ్లీ (50; 58 బంతుల్లో 3×4), రోహిత్‌ శర్మ (50 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4) అర్ధశతకాలు సాధించారు. ఛెతేశ్వర్‌ పుజారా (49; 66 బంతుల్లో 5×4) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. పిచ్ లో మార్పుతో టీమిండియా 10 పరుగులకే ఓపెనర్‌ మురళీ విజయ్‌ (9) వికెట్‌ చేజార్చుకుంది. అతడు లక్మల్‌ బౌలింగ్ లో డిక్వెలాకు క్యాచ్‌ ఇచ్చాడు. మూడో స్థానంలో వచ్చిన అజింక్య రహానె (10) ఆకట్టుకోలేదు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడి జట్టు స్కోరు 29 వద్ద పెరీరా బౌలింగ్‌లో సండకన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  delhi  Virat Kohli  cricket  

Other Articles