Kohli's Team still not the best, says Ganguly విరాట్ కోహ్లీ ఇప్పటికీ గొప్ప కెప్టెన్ కాదు..

Kohli will be greatest captains if india do well overseas says ganguly

Cricket, Virat Kohli, Indian cricket team, Sourav Ganguly, India vs south africa, India overseas schedule, India tour of South Africa, Virat Kohli captaincy, Virat Kohli vs Ricky Ponting, Virat Kohli vs Sourav Ganguly, sports news, sports, latest sports news, cricket news, cricket

Former India captain Sourav Ganguly said it is still early to call Virat Kohli and co. the best ever as the team needs to perform well in upcoming overseas tours.

విరాట్ కోహ్లీ ఇప్పటికీ గొప్ప కెప్టెన్ కాదు..

Posted: 12/07/2017 07:36 PM IST
Kohli will be greatest captains if india do well overseas says ganguly

ఒకప్పుడు వీవీఎస్ లక్ష్మణ్, భజ్జీలు వున్నారని విదేశీ గడ్డలపైకి వెళ్లి సిరీస్ లు కైవసం చేసుకుని వచ్చామని, అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ వున్నాడని ధైర్యంతో వెళ్తున్నామని చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఇవాళ మరో అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విదేశీ గడ్డపై సిరీస్ లు సొంతం చేసుకుంటేనే కోహ్లీ గొప్ప సారథి అవుతాడని అన్నాడు. వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్ ల్లో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన కోహ్లీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. ‘కోహ్లీ గెలిచిన సిరీసుల్లో ఎక్కువ శాతం సొంతగడ్డపైన జరిగినవే. విదేశాల్లో జరిగే సిరీసుల్లో విజయం సాధిస్తేనే మన సత్తా తెలుస్తోంది. త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ సిరీస్ దక్కించుకుంటే కోహ్లీ గొప్ప సారథి అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని వివరించాడు. దీని ద్వారా అయన గోప్ప క్రికెటర్ మాత్రమే కాదు గోప్ప నాయకుడు కూడా అని రుజువవుతుందని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరిన్నీ విజయాలు సాధిస్తోందన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పై ఆయా దేశాల్లో సిరీస్ లు గెలవాలని తాను అకాంక్షిస్తున్నట్లు చెప్పాడు. అప్పుడే అతని సామర్థ్యాలను అంచనా వేయగలమని అన్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనలో మన జట్టు మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అతను సాధించిన తొమ్మిది టెస్టు సిరీసుల్లో శ్రీలంక, వెస్టిండీస్‌పై మాత్రమే ఆయా గడ్డపై విజయం సాధించారు. మిగతావన్ని భారత్లో జరిగినవేనని గుర్తు చేశాడు. సొంతగడ్డపై కోహ్లీ 90 శాతం రుజువు చేసుకున్నాడు. ఇక విదేశీ గడ్డలపై నిరూపించుకోవాల్సి ఉందని గంగూలీ అన్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  Virat Kohli  India vs Sri Lanka  Test cricket  overseas  cricket  

Other Articles