virat kohli joins in 5K runs club ఐదు వేల పరుగుల క్లబ్ లోకి విరాటుడు

Virat kohli reaches 5000 runs test cricket runs today against srilanka

Inida vs sri lanka, virat kohli, 5000 runs, ind vs sl, delhi, team India, sri lanka, cricket, sports news, cricket news, latest cricket news, latest sports news, latest news

Team India captain virat kohli reaches another mile stone by completing 5000 runs in test cricket today against srilanka in delhi test.

ఐదు వేల పరుగుల క్లబ్ లోకి విరాటుడు

Posted: 12/02/2017 06:11 PM IST
Virat kohli reaches 5000 runs test cricket runs today against srilanka

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుధైన ఘనతను అందుకున్నాడు. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ మరో రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మరో టీమిండియా క్రికెటర్ గా తన పేరును నమోదు చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 24 పరుగుల దగ్గర ఫోర్ కొట్టిన విరాట్.. టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత్‌ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడయ్యాడు.

ఇప్పటివరకు కోహ్లీ 63 టెస్టుల్లో 105 ఇన్నింగ్స్‌ల ద్వారా 5003 పరుగులు సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 135/2. క్రీజులో కోహ్లీ, మురళీ విజయ్ ఉన్నారు. మురళీ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ రికార్డుతో పాటు మరో రికార్డును కూడా చేశాడు కోహ్లీ. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా 16వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 350 ఇన్నింగ్సులలో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా ఆటగాడు ఆమ్లా(363) పేరిట ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Inida vs sri lanka  virat kohli  5000 runs  delhi  team India  sri lanka  cricket  

Other Articles