Kohli leads pay rise call for India cricketers కెప్టెన్ కొత్త డిమాండ్ పై కదిలిన బిసిసిఐ

Coa chief vinod rai confirms meet with virat kohli over pay hike

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, Kohli, BCCI, Virat Kohli, bcci, coa, Vinod Rai, Rupert Murdoch, Ravi Shastri, Mahendra Singh Dhoni, Indian Premier League, sports news, sports, latest sports news, cricket news, cricket

Committee of Administrators (CoA) chief Vinod Rai confirmed that he will meet India skipper Virat Kohli and other concerned persons to discuss a possible pay hike for cricketers.

కెప్టెన్ కొత్త డిమాండ్ పై కదిలిన బిసిసిఐ.. త్వరలో భేటీ..

Posted: 11/28/2017 09:36 PM IST
Coa chief vinod rai confirms meet with virat kohli over pay hike

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో క్రికెటర్లు సరికోత్త డిమాండ్ ను బిసిసిఐ ముందు పెట్టి పెట్టగానే జట్టు యాజమాన్యంలో కదిలిక వచ్చింది. క్రికెటర్లకు సంబందించిన అంశంలో తాము సానుకూలంగానే వున్నామని ప్రకటించిన బిసిసిఐ.. ఈ మేరకు న్యూఢిల్లీ వేదికగా జరుగనున్న మూడో టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు అటగాళ్లతో చర్చించి.. వారికి సంబంధించిన డిమాండును పరిష్కరించేందుకు సిద్దంగా వున్నామని బిసిసిఐ కమిటీ అఫ్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు.

ఈ మేరకు ఇదివరకు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తమతో భేటీ అయ్యి క్రికెటర్ల డిమాండ్ అంశాన్ని గతంలోనే చర్చించారని అన్నారు. అయన తమకు దృష్టికి డిమాండ్ను తీసుకోచ్చిన క్రమంలోనే డిమాండ్ ను పరిష్కరించేలా ఒక ప్రణాళికను కూడా తమ ముందు పెట్టారని, దాని అధారంగానే నిర్ణయం తీసుకునే ముందు ఢిల్లీలో జరిగే మూడో టెస్టు సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు క్రికెటర్లతో భేటీ అయ్యిన తరువాత డిమాండ్ పరిష్కారించేలా కృషి చేస్తామని వినోద్ రాయ్ ప్రకటించారు.

ఇంతకీ ఈ డిమాండ్ ఏంటంటారా..? ఆటగాళ్ల కాంట్రాక్టు సంబంధించిన నగదును సవరించాలని ఇవాళ విరాట్ కోహ్లీ బిసిసిఐని డిమాండ్ చేశారు. గత కొంత కాలం నుంచి టీమిండియా తీరికలేని షెడ్యూళ్లతో సిరీస్‌లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో విశ్రాంతి కావాలని, తాను రోబోను కాదంటూ  కోహ్లీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేయగా, మాజీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోనీ, సౌరవ​ గంగూలీ, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిలు మద్ధతు తెలిపారు. ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్‌ నుంచి కోహ్లీకి విశ్రాంతి నిచ్చారు. అయితే తాజాగా బోర్డు తమ వేతనాలను సవరించాలని టీమిండియా అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు ఆశించడం తెరపైకి వచ్చింది. దీంతో వెనువెంటనే వినోద్ రాయ్ స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  Vinod Rai  Virat Kohli  Pay hike  BCCI  COA  cricket  

Other Articles