pro-Pakistan chants in MS Dhoni visit మహేంద్రుడికి ఛేదు అనుభవం..

Boom boom afridi and pro pakistan chants in ms dhoni visit

ms dhoni, shahid afridi, ms dhoni kashmir, boom boom afridi. icc, TeamIndia, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

MS Dhoni had recently visited Jammu and Kashmir where he was chief guest for an army-sponsored cricket tournament in Baramulla.

మహేంద్రుడికి ఛేదు అనుభవం..

Posted: 11/28/2017 05:33 PM IST
Boom boom afridi and pro pakistan chants in ms dhoni visit

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కాశ్మీర్ లో పరాభవం ఎదురైంది. అయన ఎదురుగానే కాశ్మీర్ వేర్పాటువాదులు రెచ్చిపోయారు. టీమిండియా వ్యతిరేక నినాదాలను చేయడమే కాకుండా పాకిస్థాన్ అనుకూల నినాదాలతో రెచ్చిపోయారు. యువతను ప్రోత్సహిస్తూ భారత్ సైన్యం ప్రత్యేక క్రికెట్ ఏర్పాటు చేయగా, ముఖ్యఅతిధిగా టోర్నమెంట్‌ను సందర్శించిన ధోని వేదికస్థలిలోనే ఛేదు అనుభవం ఎదురైంది.

దీంతో మిస్టర్ కూల్ తన సహనాన్ని కోల్పోకుండా అక్కడి క్రికెటర్లతో చాలాసేపు చర్చించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి భారత్ తరపున ఆడాలంటూ ప్రోత్సహించారు. ధోని వచ్చే సమయంలో కొంత మంది ఏర్పాటువాద యువకులు రెచ్చిపోయారు. భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. పాకిస్తాన్‌ ఆటగాడు ఆఫ్రీదికి అనుకూలంగా 'భూమ్‌ భూమ్‌ ఆఫ్రీది' అంటూ నినాదాన్ని అందుకున్నారు.

ఘటనాస్థలి వద్దే వున్న పలువురు పోలీసులు ఇతర అధికారులు యువకులను అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటువాద యువతను చెదరగొట్టడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి కానీ ఏవరికీ ఎలాంటి హాని కానీ జరగలేదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా.. ఇప్పుడు వైరల్‌ అయింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  shahid afridi  ms dhoni kashmir  TeamIndia  cricket  

Other Articles