Ashwin reveals his favourite scalps in Test cricket ‘‘మైలురాయిలో ప్రత్యకమైనవి ఎన్నో.. కొన్ని వివరిస్తా..’’

Ravichandran ashwin reveals his favourite scalps in test cricket

india vs sri lanka, r ashwin, r ashwin wickets, r ashwin 300 wickets, r ashwin bowling, sri lanka tour of india 2017, sports news, sports, cricket news, cricket

R Ashwin took four wickets in the second innings to become the fastest bowler to 300 Test wickets; helped hosts complete an innings-&-239-run victory over Sri Lanka

‘‘మైలురాయిలో ప్రత్యకమైనవి ఎన్నో.. కొన్ని వివరిస్తా..’’

Posted: 11/28/2017 04:46 PM IST
Ravichandran ashwin reveals his favourite scalps in test cricket

అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్ గా తన పేరును లిఖించుకున్నాడు భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్. అనతికాలంలోనే  ఈ అరుదైన ఘనతను అందుకున్న అశ్విన్.. తాను అందుకున్న మైలురాయిలో చాలా వికెట్లు ప్రత్యేకమైనవి చెప్పారు. అందులో కొన్నింటిని వివరించాడు కూడా. అంతటి గొప్ప మైలురాయిని అందుకున్న అశ్విన్ కు.. తాను సాధించిన వికెట్లు గుర్తుండంపై నెట్ జనులు కితాబిస్తున్నారు.

‘ఇప్పటి వరకు సాధించిన 300 వికెట్లలో ఎన్నో ప్రత్యేకమైనవి ఉన్నాయి. వీటిలో కొన్నింటి గురించి చెబుతాను. వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రావో నా తొలి టెస్టు వికెట్‌. ఇది ఎప్పటికీ ప్రత్యేకమే. నా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా సార్లు ఔటయ్యాడు. కానీ, ఈ ఏడాది బెంగళూరులో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టులో రెండో రోజు ఆటలో నేను వార్నర్ ను ఔట్ చేశాను.

ఇది కూడా ప్రత్యేకమే. అంతేకాదు 2015లో నాగ్ పూర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఏబీ డివిలియర్స్ వికెట్ దక్కించుకున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేను’ అని అశ్విన్ తెలిపాడు. జట్టు యాజమాన్యానికి‌, కెప్టెన్ విరాట్ కోహ్లీకి‌, సహచర ఆటగాళ్లకు ఈ సందర్భంగా అశ్విన్ ధన్యవాదాలు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  ravichandran ashwin  milestone  300 wickets  bowling  cricket  

Other Articles