Saina, Prannoy out of China Open చైనా ఓపెన్ నుంచి సైనా, ప్రణాయ్ ఔట్.?

Saina prannoy crash out in china open second round

Saina Nehwal, HS Prannoy, China Open, Superseries, Badminton, Akane Yamaguchi, Lee Cheuk Yiu

star shuttler Saina Nehwal knocked out of the China Open Superseries Premier after going down in straight games at the hands of fifth-seed Akane Yamaguchi of Japan

చైనా ఓపెన్ నుంచి సైనా, ప్రణాయ్ ఔట్.?

Posted: 11/16/2017 06:57 PM IST
Saina prannoy crash out in china open second round

భారత స్టార్ షట్లర్లు ఇవాళ దేశీయ బ్యాడ్మింటన్ క్రీడాభిమానులను నిరాశపర్చారు. మహిళల విభాగంతో స్టార్ గా వెలుగోందుతున్న సైనా నెహ్వాల్ తో పాటుగా పురుషుల విభాగంతో అగ్రశ్రేణి అటగాడిగా వున్న హెచ్‌.ఎస్‌.ప్రణయ్ లు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి నిష్ర్కమించారు. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పట్టారు. కాగా ప్రస్తుతం భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో స్టార్ షెట్లర్ పీవీ సింధు టోర్నీలో కొనసాగుతుంది.

పురుషుల సింగిల్స్ లో భాగంగా జరిగిన రెండో రౌండ్లో ప్రణయ్‌ 19-21, 17-21 తేడాతో హాంకాంగ్ క్రీడాకారుడు లీ చీక్ యు చేతిలో ఓటమి చవిచూశాడు. అలాగే మహిళల సింగిల్స్ లో భాగంగా జపాన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి, ఐదో సీడ్ యమగూచితో సైనా నెహ్వాల్ తలపడింది. 37 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో 21-18, 21-11తేడాతో సైనా ఓటమి పాలైంది. తొలి గేమ్ లో కాస్త పోరాడిన సైనా రెండో గేమ్ లో ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో గేమ్ తో పాటు మ్యాచ్ ను చేజార్చుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  HS Prannoy  China Open  Superseries  Badminton  Akane Yamaguchi  Lee Cheuk Yiu  

Other Articles