Kirmani lashes out at VVS and Agarkar ధోని అంటే అసూయపడుతున్నారా.? నిలదీసిన కోచ్

Are people jealous of ms dhoni asks indian coach ravi shastri

Team India, MS Dhoni, Syed Kirmani, Ravi Shastri, Virat Kohli, India vs New Zealand, India vs Sri Lanka, Cricket news, sports news, sports, latest sports news, ms dhoni news, cricket

The former Indian captain MS Dhoni has been receiving overwhelming support and head coach Ravi Shastri was the latest to throw his weight behind the World Cup winning skipper.

ఆయన ఇంకా బాగా రాణిస్తున్నాడనే అసూయా..?

Posted: 11/10/2017 03:32 PM IST
Are people jealous of ms dhoni asks indian coach ravi shastri

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని మాజీ కెప్టెన్ ధోనిపై వస్తున్న విమర్శలను తప్పుబడుతూ.. అటు జట్టులోని క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తు మద్దతు లభిస్తున్న క్రమంలో ఆయన ఇక నెహ్రా అశించినట్లు టీ20 వరల్డ్ కప్ వరకు జట్టులోనే కొనసాగే అవకాశాలే అధికంగా కనబడుతున్నాయి. ఆయనకు లభిస్తున్న మద్దుతు ముందు విమర్శకులు తేలిపోయే పరిస్థితి వుంది. దీంతో ఇప్పటికే విరాట్‌ కోహ్లి, సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌, మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌లు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

తాజాగా టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా వీరి సరసన చేరాడు. అసూయతోనే ధోనిపై కొంతమంది పనిగట్టుకోని విమర్శలు చేస్తున్నారని రవిశాస్త్రి మండిపడ్డారు. వారంతా కుళ్లు.. కుతంత్రాలతో ధోని నాశనం కోసం ఎదురుచూస్తున్నారని ఓ బెంగాళీ స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నారు.  ‘కానీ ధోని ఓ దిగ్గజం. అతని కెరీర్‌ ఎలా మలుచుకోవాలో అతనికి బాగా తెలుసు. ధోని ఓ గొప్ప నాయకుడని కితాబిచ్చాడు. ఆయనోక ఒక సూపర్‌ స్టార్ అని ప్రశంసించాడు. ఈ వయస్సులో కూడా ఆయన ఇంకా బాగా రాణిస్తున్నాడని, చాలా ఫిట్ గా వున్నాడని అసూయ చెందుతున్న వాళ్లే ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ధోని ఓ అద్బుతమై ఆటగాడు కాబట్టే టీవీ చానళ్లు ధోని సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సంచలనం చేస్తున్నాయి. ధోని 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించినా.. అతిని వన్డే యావరేజ్‌ 60కి తగ్గలేదని, గత శ్రీలంక, ఆస్ట్రేలియాల సిరీస్ ల్లో మ్యాచ్‌లను  గెలిపించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా సూచించారు. అయితే దీనిని మాజీ టీమిండియా వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ కూడా మద్దతు పలికాడు. ఆయన ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ పై మండిపడ్డాడు. అసలు ధోనిని విమర్శించే ముందు వారి స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నాడు. ధోని దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. టీమిండియాలో ధోనిలాంటి అనుభవజ్ఞుడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Syed Kirmani  Ravi Shastri  Virat Kohli  India vs New Zealand  India vs Sri Lanka  cricket  

Other Articles