Steve Smith calls Virat Kohli's DRS claims 'rubbish' విరాట్ అరోపణలపై చర్యలేవీ..?: స్మీత్

Virat kohli s drs claims during bengaluru test were rubbish steve smith

India vs Australia, Virat Kohli vs Steve Smith, Brain fade, Kohli vs Smith, Kohli Smith controversy, Indian cricket team, Australia cricket team, brain fade row, My journey, Steve Smith book

Australia cricket captain Steve Smith targeting Indian counterpart Virat Kohli in the ‘brain fade’ row over his seeking dressing room help for DRS review that marked a real low in their Test series

విరాట్ అరోపణలు నిజమైతే చర్యలేవీ..? ప్రశ్నించిన స్టీవ్ స్మిత్

Posted: 10/27/2017 07:01 PM IST
Virat kohli s drs claims during bengaluru test were rubbish steve smith

టీమిండియా పర్యటనలో తగిలిన పాత గాయాలను గుర్తుచేసుకుని తన సమఉజ్జీ అయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని.. టార్గెట్ చేసిన ఆసీస్‌ జట్టు సారధి స్టీవ్ స్మిత్.. డీఆర్ఎస్ వివాదంపై విరాట్ సహా బిసిసిఐ పిర్యాదు చేస్తే.. ఇప్పటివరకు ఈ విషయమై ఐసీసీ తమపై విచారణను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించాడు. సిరీస్ లో భాగంగా  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో స్మిత్ ఔట్ కాగా, అంపైర్ కూడా ఔట్ అని సిగ్నల్ ఇచ్చాడు.

అయితే డీఆర్ఎస్ విధానాన్ని ఎంచుకునేందుకు సిద్దమైన స్మిత్.. అందుకుముందు డ్రస్సింగ్ రూం వైపు చూశాడు. దానిని తప్పుగా పరిగణించిన విరాట్ కోహ్లీ దానిపై అంపైర్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశం కాస్తా అప్పట్లో పెను సంచలనంగా మారింది. డీఆర్ఎస్ కు ముందు క్రికెటర్లు డ్రెస్సింగ్ రూరం వైపు చూడటం తప్పని దిగ్గజ క్రికెట్ మాజీలు కూడా కామెంట్లు చేశారు. తాజాగా ఈ ఘటన గురించి స్మిత్ తన పుస్తకం ‘మై జర్నీ’లో ప్రస్తావించాడు.

‘బెంగళూరు టెస్టు జరిగే సమయంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఆసీస్ క్రికెటర్లు డ్రస్సింగ్ రూమ్ వైపు చూడడం గతంలో తాను చూసినట్లు ఆరోపించాడు. దీనిపై అతడు ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. కోహ్లీ చేసిన ఈ ఆరోపణలన్ని అసంబద్దమైనవి. అవే నిజమైతే కోహ్లీ పిర్యాదును అందుకున్న అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలు, ఐసీసీ మమ్మల్ని ప్రశ్నించాలి కదా. ఇప్పటివరకు అదేమీ జరగలేదు. ఇదంతా మ్యాచ్ లో విజయం కోసం కోహ్లీ వేసిన వ్యూహం మాత్రమే అని పేర్కోన్నాడు‘‘.

’’ఇక దీంతో మా జట్టును మానసికంగా దెబ్బ తీస్తే విజయం సాధించవచ్చన్నది కోహ్లీ గేమ్ ప్లాన్‌. ఈ మ్యాచ్ తర్వాత మేము చాలా సార్లు కలిశాం. కానీ, ఒక్కసారి కూడా మా మధ్య దీని గురించి చర్చ జరగలేదు. మైదానంలో కోహ్లీ దూకుడును నేను ఇష్టపడతా.. కానీ బెంగళూరులో డీఆర్ఎస్ వివాదం మాత్రం పూర్తిగా నిరాధారమైనది. మీడియా సమావేశంలో కోహ్లీ అలా ఎందుకు మాట్లాడాడో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  Virat Kohli  Steve Smith  Brain fade  DRS controversy  My journey  cricket  

Other Articles