Bumrah's direct hit left MS Dhoni in splits మలుపు తిప్పిన రనౌట్ తరువాత.. ధోని నవ్వే.. నవ్వు..

Jasprit bumrah s direct hit to run out tom latham

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, bumrah, dhoni, laugh, New Zealand, Virat Kohli, Tom Latham, Jadhav, Kuldeep Yadav, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

MS Dhoni and Jasprit Bumrah combined to run out Tom Latham which proved to be the turning point in India's win.

మలుపు తిప్పిన రనౌట్ తరువాత.. ధోని నవ్వే.. నవ్వు..

Posted: 10/30/2017 06:04 PM IST
Jasprit bumrah s direct hit to run out tom latham

న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ గెలుపును నిర్ధేశించే అత్యంత కీలక నిర్ణయాత్మకమైన మూడవ వన్డే మ్యాచులో మ్యాఛ్ ఫలితాన్ని తిప్పింది మాత్రం కేవలం ఒక్క రనౌట్ అనడంలో సందేహమే లేదు. న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాడు టామ్ లాథమ్ మంచి జోరు మీద ఉన్న సమయంలో అతన్ని బూమ్రా రనౌట్ చేయడంతో కివీస్ చేతిలోంచి మ్యాచును టీమిండియా తన వైపుకు లాక్కుంది.

వివరాల్లోకి వెళ్తే.. 48 ఓవర్ లో బూమ్రా వేసిన ఐదో బంతిని యార్కర్ గా సంధించాడు. దాంతో క్రీజ్ లో ఉన్న గ్రాండ్ హోమ్ బంతిని హిట్ చేయడంలో విఫలమయ్యాడు. కాగా, అవతలి ఎండ్ లో ఉన్న టామ్ లాథమ్ కు స్ట్రైకింగ్ కు ఇచ్చే ఉద్దేశంలో సింగిల్ కోసం పరుగు తీసే ముందు లాథమ్ కు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునందుకున్న లాథమ్ పరుగు పరుగున రమారమి పిచ్ లో సగం దూరం వరకు వచ్చేశాడు.

అదే సమయంలో బాల్ అందుకున్న ధోని.. దానిని అవతలి ఎండ్ లో వున్న బౌలర్ బూమ్రాకు విసిరాడు. దాన్ని ఒడిసి పట్టుకున్న బూమ్రా.. అంతే వేగంతో వికెట్లను గిరటేశాడు. దాంతో లాథమ్ భారంగా పెవిలియన్ కు చేరాల్సివచ్చింది. అయితే బూమ్రా చేసిన చర్యకు మాత్రం ధోని ఒకింత అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. బంతి వికెట్లకు తాకడంతో.. విపరీతంగా నవ్వుకున్నాడు. వికెట్లదగ్గరికి వెళ్లి బెయిల్స్ ను కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, బూమ్రా బంతిని అందుకున్న చోట నుంచి రనౌట్ చేయడంపై ధోని పగలబడి మరీ నవ్వుకున్నాడు.

ఒకవేళ ఆ బంతి వికెట్లకు తాకకుండా ఉంటే ఏమయ్యేదనే అర్థం వచ్చేలా ధోని నవ్వుతూ ప్రశ్నించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతని అవుటైన తరువాత ఊపిరి పీల్చుకున్న భారత జట్టు.. కడవరకూ పోరాటం సాగించి ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకవేళ లాథమ్ ను రనౌట్  చేయడంలో విఫలమైతే మాత్రం సిరీస్ లో ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాథమ్(65)హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Ind vs NZL  bumrah  dhoni  laugh  Virat Kohli  Tom Latham  cricket  

Other Articles