Rashid Khan gets a proposal during a CPL వార్నీ మరీ ఇలాగా ప్రపోజ్ చేసేంది..?

Rashid khan gets a marriage proposal during a cpl game

rashid khan, afghanistan, spinner, sunrisers hyderabad, CPL, West Indies, Afghanistan, cricket, latest cricket news, sports news, sports, cricket, latest news

A teenager watching the game inside the stadium was spotted with a placard, which read, “Rashid Khan – You’re young, I’m young. My roti is round, let’s settle down.”

వార్నీ మరీ ఇలాగా ప్రపోజ్ చేసేంది..?

Posted: 08/26/2017 02:56 PM IST
Rashid khan gets a marriage proposal during a cpl game

క్రికెటర్లకు వున్న క్రేజ్ అంతాఇంత కాదు. ఇక మంచిగా రాణించి హాట్ టాఫిక్ గా మారిన క్రికెటర్లకు వెల్లువలా అఫర్లు వచ్చిపడతాయి. ప్రపంచ కప్ కొడితే.. టీమిండియా క్రికెటర్లకు న్యూడ్ ఢిన్నర్ ఇస్తానన్న మోడల్ పూనం పాండే గుర్తుంది కదూ.. ఆ మధ్య వార్తల్లో నిలిచి నానా హంగామా కూడా చేసింది. ఇలాంటి అఫర్లతో పాటు పెళ్లి ప్రపోజల్స్ కూడా వస్తాయి. దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డీకాక్ ఇలాంటి ప్రపోజల్ కే బంధాన్ని కలుపుకున్నాడు.

చీర్ లీడర్ గా పని చేసిన సషా హర్లీ ఆటోగ్రాఫ్ కోసం డీకాక్ కు దగ్గరకువచ్చింది. ఆ సందర్భంలో డీ కాక్ కు ఐ లవ్ యూ చెప్పగా, వారి బంధం బలపడి పెళ్లి వరకూ వెళ్లింది. అయితే టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా ఇలాంటి ప్రపోజల్ వచ్చింది. దాదాపు పదేళ్ల  క్రితం భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్నప్పుడు జహీర్ ఖాన్ కు ఓ అమ్మాయి ఐ లవ్యూ రాసి ఉన్న ఫ్లకార్డును చూపింది. దానికి జహీర్ ఖాన్ స్పందించలేదు. అచ్చం అలాగే.. ఇప్పుడు మరో టీనేజ్ అమ్మాయి మరో క్రికెటర్ కు ప్రపోజ్ చేసింది.

అప్ఘనిస్తాన్ సిన్నర్ రషీద్ ఖాన్ తెలుసుకదూ.. రూ. 4 కోట్లకు వేలంలో కొనుగోలుతో అతని పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.. ఐపీఎల్ ఈ ఏడాది సన్ రైజర్స్ తరపున అడి తన సత్తాను కూడా నిరూపించుకున్నాడు రషీద్ ఖాన్. తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ అడుతున్న రషీద్ ఖాన్ కు ఓ యువతి ప్రపోజ్ చేసింది. మనమిద్దరం పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అంటూ ఫ్లకార్డు ద్వారా చూపింది.

అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న రషీద్.. సెయింట్ లూసియా స్టార్స్‌తో గ్రూప్ తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. రషీద్.. నువ్వు యంగ్, నేను యంగ్. మనిద్దరం సెటిల్ అవుదామంటూ ప్లకార్డు ద్వారా మనసులో మాటను అతనికి చెరవేసింది.అయితే రషీద్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అయితే నెట్ జనులు మాత్రం క్రికెటర్ కు లవ్ ప్రపోజల్ చేసిది మారీ ఇలాగా అంటూ విమర్శలు చేస్తుంటే మరికోందరు మాత్రం యువతి తన మనస్సులోని కొరికను ధైర్యంగా బయటపెట్టిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashid khan  afghanistan  spinner  sunrisers hyderabad  CPL  West Indies  Afghanistan  cricket  

Other Articles