భారత క్రికెట్ మాజీ ఓపెనర్.. డాషింగ్ బ్యాట్స్ మెన్ గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి బ్యాట్ అందుకుని పరుగులు కోసం వేట కొనసాగించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఆ మధ్య సచిన్ టెండుల్కర్ నేతృత్వంలోని వెటరన్స్ కప్ లో పరుగులు సాధించిన సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ చేతబట్టి పరుగులు సాధించడమేంటని అనుకుంటున్నారా..? కానీ ఇది నిజమే. యూఏఈలో డిసెంబరు 21 నుంచి 24 మధ్య టీ10 లీగ్ జరగనుంది. ఈ టోర్నీ కోసం సెహ్వాగ్ బ్యాట్ పట్టనున్నాడు.
టీ20 తరహాలోనే టీ10 ఫార్మాట్ కు దుబాయ్ వేదిక కానుంది. ఒక్కో మ్యాచ్ నిర్వహణకు సుమారు 90నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. ఈ మ్యాచ్ లలో దక్షిణ ఆసియా నుంచి మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు సెలబ్రెటీలు హాజరుకానున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, క్రిస్‌గేల్, కుమార సంగక్కర తదితరులు ఈ టోర్నీలో బరిలో దిగనున్నారు. పంజాబీస్, మరాఠాస్, బంగ్లాస్, లంకన్స్, సింధీస్, కేరళిటీస్, పఖ్తూన్స్గా జట్ల పేర్లను ప్రకటించారు. పఖ్తూన్స్ జట్టుకి అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. యూఏఈలోని షార్జా క్రికెట్ మైదానంలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more